iDreamPost
android-app
ios-app

‘దేవర’ మూవీ చూస్తూ థియేటర్లో NTR అభిమాని మృతి! ఎక్కడంటే..?

  • Published Sep 27, 2024 | 12:10 PM Updated Updated Sep 27, 2024 | 12:16 PM

Devara Movie: మ్యాన్ ఆఫ్ ది మాస్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీపై పాజిటీవ్ రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ సంతోషాల్లో మునిగిపోతున్నారు. తాజాగా దేవర థియేటర్లో విషాదం చోటు చేసుకుంది.

Devara Movie: మ్యాన్ ఆఫ్ ది మాస్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీపై పాజిటీవ్ రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ సంతోషాల్లో మునిగిపోతున్నారు. తాజాగా దేవర థియేటర్లో విషాదం చోటు చేసుకుంది.

  • Published Sep 27, 2024 | 12:10 PMUpdated Sep 27, 2024 | 12:16 PM
‘దేవర’ మూవీ చూస్తూ థియేటర్లో NTR అభిమాని మృతి! ఎక్కడంటే..?

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ గురించిన టాక్ వినిపిస్తుంది. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ సోలోగా నటిస్తున్న ‘దేవర’పై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ మూవీతో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. అంతేకాదు ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కనిపించి అలరించబోతున్నాడు. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అయితే  మిడ్ నైట్ నుంచి బెనిఫిట్ షోల్లో దేవర మూవీ చూస్తూ పూనకాలతో ఊగిపోతున్నారు ఫ్యాన్స్. ఇలాంటి సమయంలో దేవర థియేటర్లో విషాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ జాతర మొదలైంది. రెండు వారాల నుంచి ఈ మూవీపై వస్తున్న హైప్ కి తగ్గట్టుగానే మిడ్ నైట్, యూఎస్ ప్రీమియర్ షోలకు సంబంధించి ఎక్స్ లో పాజిటీవ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ధియేటర్ల వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ మూవీలో కొన్ని సీన్లు చూస్తుంటే థియేటర్లో పూనకాలతో ఊగిపోతారని అంటున్నారు. తాజాగా దేవర థియటర్లో విషాదం చోటు చేసుకుంది. కడపలో దేవర సినిమా చూస్తూ ఎన్టీఆర్ అభిమాని కుప్పకూలిపోయాడు. దేవర మూవీ రిలీజ్ సందర్భంగా కడపలోని అప్సర థియేటర్లో అభిమానుల కోసం ఫ్యాన్స్ షో వేశారు.  దేవర మూవీలో ఎన్టీఆర్ ఎంట్రీ.. ఫైట్స్, డైలాగ్స్ ఇలా ప్రతి సీన్ కి ఫ్యాన్స్ అరుపులు, కేకలు, చప్పట్లు.. విజిల్స్ తో రెచ్చిపోయారు. ఇదే సమయంలో ఓ అభిమాని కేకలు వేస్తూ హఠాత్తుకు సీట్లోనే కుప్పకూలిపోయాడు.

పక్కనే ఉన్న అభిమానులు, థియేటర్ సిబ్బంది వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ అభిమాని మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు సీకే దిన్నె మండలం జమాల్‌పల్లికి చెందిన మస్తాన్ వలీగా గుర్తించారు పోలీసులు. మస్తాన్ వలీ నందమూరి ఫ్యామిలీ హీరోలకు అభిమాని.. ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం అని సన్నిహితులు చెబుతున్నారు. దేవర మూవీ ఫస్ట్ షో చూసి ఎంజాయ్ చేయాలని అప్పటి వరకు తమతో అన్నాడని.. ఇలా అనుకోకుండా ప్రాణాలు కోల్పోతాడని ఊహించలేకపోయాని కన్నీరు పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు, స్నేహితులు.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş