iDreamPost
android-app
ios-app

3 ఏళ్ల తర్వాత.. క్రేజీ హీరోని పట్టిన మురుగదాస్! ఎవరంటే?

  • Author Soma Sekhar Published - 04:18 PM, Tue - 26 September 23
  • Author Soma Sekhar Published - 04:18 PM, Tue - 26 September 23
3 ఏళ్ల తర్వాత.. క్రేజీ హీరోని పట్టిన మురుగదాస్! ఎవరంటే?

ఏఆర్ మురుగదాస్.. ఇండియన్ సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ యువ దర్శకుల ఎంట్రీతో వెనకబడిపోయాడీ స్టార్ డైరెక్టర్. ఇక మురుగదాస్ నుంచి లాస్ట్ సినిమా వచ్చి.. దాదాపు మూడు సంవత్సరాలకు పైగానే అవుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘దర్బార్’ చిత్రం మురుగదాస్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం కావడం గమనార్హం. ఈ మూవీ తర్వాత అతడిని నుంచి ఏ సినిమా అనౌన్స్ మెంట్ కాలేదు. తాజాగా ఓ సినిమాను ప్రకటించాడు ఈ స్టార్ డైరెక్టర్. క్రేజీ హీరోతో సినిమాను ప్రకటించాడు. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మరి 3 ఏళ్ల తర్వాత మురుగదాస్ పట్టిన ఆ క్రేజీ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.

తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. దాదాపు 3 సంవత్సరాల తర్వాత సినిమాను ప్రకటించడం విశేషం. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ మూవీలో క్రేజీ హీరో శివకార్తికేయన్ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతోంది. కాగా.. ఇది శివకార్తికేయన్ కు 23వ చిత్రం. డైరెక్టర్ మురుగదాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్ననట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే శివకార్తికేయన్ డైరెక్టర్ మురుగదాస్ తో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. “మురుగదాస్ సర్ మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ చిత్రం నాకు స్పెషల్. షూటింగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు శివకార్తికేయన్. దీనికి స్పందించిన మురుగదాస్. “థ్యాంక్యూ సో మచ్ శివ. మీతో ఈ ప్రాజెక్ట్ లో చేరినందుకు సంతోషంగా ఉంది. మనం కలిసి సినిమాటిక్ మ్యాజిక్ ను సృష్టిద్దాం” అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన నటీ, నటులను ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు. మరి 3 ఏళ్ల తర్వాత సినిమా ప్రకటించిన స్టార్ డైరెక్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş