iDreamPost
android-app
ios-app

రజినీకాంత్ కి కారు గిఫ్ట్ ఇవ్వడం వెనకున్న అసలు నిజం ఇదే?

  • Published Sep 25, 2023 | 12:08 PM Updated Updated Sep 25, 2023 | 12:10 PM
  • Published Sep 25, 2023 | 12:08 PMUpdated Sep 25, 2023 | 12:10 PM
రజినీకాంత్ కి కారు గిఫ్ట్ ఇవ్వడం వెనకున్న అసలు నిజం ఇదే?

భారతీయ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. అభిమానులు సూపర్ స్టార్, తలైవర్ అని అభిమానంతో పిలుచుకుంటారు. రజినీకాంత్ వెండితెరపై కనిపిస్తే చాలు థియేట్లలో అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. సిగరెట్ తాగడం, నడక, పంచ్ డైలాగ్స్ ఇలా రజినీకాంత్ ఏది చేసినా డిఫరెంట్ స్టైల్ ఉంటుందని అంటారు. ఏడు పదులు దాటినా ఆయన ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీపడి నటిస్తున్నారు. ఈ మద్య రిలీజ్ అయిన జైలర్ చిత్రంతో రజినీకాంత్మం మంచి విజయం అందుకున్నారు. తాజాగా రజినీకాంత్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన ఆయన వెండితెరపై ఏది చేసినా స్టైల్ గా ఉంటుందని అంటారు. 1975 లో కే. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ మూవీతో సినీ ప్రస్థానం మొదలు పెట్టారు. కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రల్లో నటించి తర్వాత హీరోగా మారారు. 70 ఏళ్లు దాటినా రజినీకాంత్ ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి మరీ నటిస్తు మంచి విజయాలు అందుకుంటున్నారు. యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమా మంచి సక్సెస్ సాధించడంతో నిర్మాత కళానిధి మారన్.. సూపర్ స్టార్ రజినీకాంత్ కు రూ.100 కోట్ల చెక్ అందించడంతో పాటు, లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చి సత్కరించారు.

ఇటీవల జైలర్ మూవీ సక్సెస్ మీటింగ్ కి నిర్మాత కళానిధి మారన్ ఇచ్చిన కారులోనే వచ్చారు రజినీ. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. నేను ఇప్పుడిప్పుడే ధనవంతుడినైనట్లు భావన వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే రజినీకాంత్ ఇలా అనడం వెనుక ఆంతర్యం ఏంటా అని చాలా మందికి అనుమానాలు వచ్చాయి. రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ క్రిటిక్‌ బిస్మీ ఇలా స్పందించాడు. సినీ ఇండస్ట్రీలో ఏన్నో ఏళ్లుగా కొనసాగుతున్న రజినీకాంత్ ఏనాడు లగ్జరీ కార్లు మెయింటేన్ చేయలేదని.. చాలా ఏళ్లుగా ఆయన అంబాసిడర్ కారులోనే తిరిగేవారని అన్నారు. పదేళ్ళ క్రితం ఆయన ఇన్నోవా కారుకు మారినట్లు తెలిపారు. తన సహ నటులు లగ్జరీ కార్లలో వస్తుంటే.. రజినీకాంత్ మాత్రం అంబాసిడర్ కారులోనే షూటింగ్ కి వచ్చేవారని అన్నారు.

Kalanidhi maran car gift to rajinikanth

రజినీకాంత్ తల్చుకుంటే ఎన్నో లగ్జరీ కార్లు కొనేవారని.. కానీ ఆయన మాత్రం సాధారణ జీవితాన్నే గడిపేవారని.. ఎన్నో సంవత్సరాలు అంబాసిడర్ కారు వాడిన ఆయన ఆ మద్య ఇన్నోవా కారు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే నిర్మాత కళానిధి మారన్.. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఓ లగ్జరీ కారు బహుబతి ఇచ్చారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని రజినీకాంత్ తాను ఇప్పుడిప్పుడే ధనవంతుడిని అయ్యానని మీడియా వేధికగా చెప్పి ఉంటారని బిస్మీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జైలర్ సక్సెస్ తో దర్శకుడు నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కి కూడా లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş