ధారాళంగా ఎన్నికల హామీలు ఇవ్వడం సమంజసం కాదు. ఆచరణ సాధ్యమైన హామీలే ఇవ్వాలి. ఇచ్చిన వాగ్దానాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజకీయ పార్టీలకు సూచించారు. రెండు రోజులుగా ఏపీలో పర్యటిస్తున్న ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవలి కాలంలో ఎన్నికల హామీలు గుప్పించడంలో పార్టీలు పోటీపడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవో కొన్నింటిని అమలుచేసి.. మిగతావాటిని విస్మరిస్తున్నాయి. ఈ ధోరణి పట్ల వెంకయ్య ఆవేదన సమంజసమే. కానీ ఇక్కడ గమనించాల్సిన […]
ఏపీలో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం జులై 4వ తేదీ నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభించాలని జగన్ సర్కార్ యోచిస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు […]
ఆంధ్రప్రదేశ్ లో అధికారం దక్కదనే దుగ్ధతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగానూ బద్నాం చేసే పనిలో బాబు బ్యాచ్ ఉంది. కానీ ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏపీలో అప్పులు పెరిగిపోతున్నాయని పచ్చమీడియా సహా అందరూ గగ్గోలు పెడుతుంటారు. కానీ ఏపీలో ఆదాయం పెరుగుతున్నట్టుగా రిజిస్ట్రేషన్ల రాబడి సహా జీఎస్టీ వసూళ్ల వరకూ అనేక అంశాలు రుజువు చేస్తాయి. లెక్కలతో మాకు పనిలేదంటూ, కాకి లెక్కలతోనే ఆ సెక్షన్ గోలపెడుతున్న తీరు విడ్డూరంగా ఉంటుంది. ఆ క్రమంలోనే […]
వచ్చే ఎన్నికలకు సంబంధించిన చర్చ ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా రాజుకుంటోంది. ముందస్తు ఎన్నికల గురించి టీడీపీ ఊహాగానాలతో సాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ కూడా ఇటీవల రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల గురించి ప్రస్తావించడం దానికి ఊతమిచ్చింది. దాదాపుగా 50 మంది ఎమ్మెల్యేల పనితీరుని ఆయన ప్రస్తావించడం ఆసక్తిగా మారుతోంది. దాంతో రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున బరిలో దిగేవారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మూడోవంతు మందికి ఛాన్స్ ఉండదా అనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే జగన్ మాత్రం […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణాలో జిల్లాల విభజన ఐదేళ్ల క్రితమే జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నాటి చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పాలన కేంద్రీకరణకే ప్రాధాన్యతనిచ్చిన చంద్రబాబు తీరుకి భిన్నంగా పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు జగన్ ప్రాధాన్యతనిస్తున్నారు. రాజధాని నుంచి గ్రామ సచివాలయాల వరకూ అన్నింటా దానిని ఆచరిస్తున్నారు. ఆ క్రమంలోనే జిల్లాల విభజనకి కూడా శ్రీకారం చుట్టారు. ప్రాధమిక నోటిఫికేషన్ మీద ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాటిని పరిశీలించి తుది నివేదిక […]
అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌ను ఇరుకునపెట్టేలా ప్రతిరోజూ టీడీపీ అనుకూల మీడియా కథనాలు వండి వారుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంది. జగన్ సర్కార్‌కు అప్పులు కూడా పుట్టకూడదని భావిస్తున్నట్లుగా ఆ పత్రిక ఈ రోజు రాసిన కథనాన్ని చూస్తే అర్థమవుతోంది. ఏపీకి బ్యాంక్ ఆఫ్ బరోడా అప్పులు ఇస్తోందని, ఇతర బ్యాంకులు వెనక్కి తగ్గినా, బ్యాంక్ ఆఫ్ బరోడా అప్పులు ఇవ్వడం వెనుక రహస్యం ఏమిటంటూ […]
మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో మరో ముందడుగు పడింది. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తి నియంత్రణ, వైరస్ సోకినా స్వల్ప లక్షణాలతో బయటపడే అవకాశం ఉంటోంది. వ్యాక్సిన్ భారీగా వేయడం ద్వారానే కరోనా మూడో వేవ్‌ను భారత దేశం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. తాజాగా బుధవారం 12–14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఏపీలో తొలిరోజు 4,767 మందికి వైద్య ఆరోగ్య సిబ్బంది […]
మంచి ఎక్కడిదైనా తీసుకుని పాటించాలంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు అదే చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేలా ఏపీలో విజయవంతమైన మన బడి, నాడు–నేడు, ఇంగ్లీష్ మీడియం విద్యను తెలంగాణలోనూ అమలు చేసేందుకు నిర్ణయించిన కేసీఆర్ సర్కార్.. ఆ దిశగా తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ భారీగా నిధులు కేటాయించింది. ఏపీ తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు తెలంగాణ సర్కార్ మన బడి – మన ఊరు, మన బస్తి – […]
పవన్ కల్యాణ్ సినిమా భీమ్లానాయక్ విడుదలైన థియేటర్ల వద్ద ప్రభుత్వ సిబ్బందిని నియమించడం బాధాకరమని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహార్ చేసిన వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. సినిమాకు వచ్చేవారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉద్యోగులను థియేటర్ల వద్ద ఉంచారని ఆయన ఆరోపించడాన్ని వైఎస్సార్ సీపీ నేతలు ఖండిస్తున్నారు. శనివారం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ధియేటర్ల వద్ద కర్ఫ్యూలాంటి వాతావరణం తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్మోహనరెడ్డికే దక్కిందన్నారు. ప్రభుత్వం సామాన్యుల పక్షం వహించి సినిమా […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నూతన కమిషనర్‌ను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీతో ప్రస్తుత కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీ కాలం ముగియబోతోంది. ఐదేళ్ల కిందట చంద్రబాబు ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అత్యంత వివాదాస్పద అధికారిగా పేరుగాంచారు. నూతన ఎస్ఈసీ ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ […]