iDreamPost
android-app
ios-app

మీ ఫోన్ పోయిందా.. జస్ట్ Hi అని పెట్టండి.. పోలీసులే తెచ్చి ఇస్తారు

  • Published Apr 12, 2024 | 5:36 PM Updated Updated Apr 12, 2024 | 6:37 PM

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన సెల్ ఫోన్ చోరీలు అనేవి విపరీతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చాలామంది బాధితులు ఇలా ఫోన్లు పొగొట్టుకోవడం వన అందులో ఉండే విలువైన సమాచారమంతా దక్కకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారి కోసం తాజాగా రాష్ట్ర పోలీస్‌ శాఖ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన సెల్ ఫోన్ చోరీలు అనేవి విపరీతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చాలామంది బాధితులు ఇలా ఫోన్లు పొగొట్టుకోవడం వన అందులో ఉండే విలువైన సమాచారమంతా దక్కకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారి కోసం తాజాగా రాష్ట్ర పోలీస్‌ శాఖ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • Published Apr 12, 2024 | 5:36 PMUpdated Apr 12, 2024 | 6:37 PM
మీ ఫోన్ పోయిందా.. జస్ట్  Hi అని పెట్టండి.. పోలీసులే తెచ్చి ఇస్తారు

ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగం ఎంత పెరిగిందో.. వాటి చోరీలకు పాల్పడే ఘటనలు కూడా అంతే ఎక్కువగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఇలా స్మార్ట్ ఫోన్ వాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రతిఒక్కరూ రకరకాల ఖరీదైన స్మార్ట్ ఫోన్ లను ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. మరి, ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసుకున్న పోన్స్ అనేవి ఇటీవల కాలంలో చోరికి గురవుతున్నాయి. అయితే ఎక్కడ చూసిన సెల్ ఫోన్ చోరీలు అనేవి విపరీతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చాలామంది బాధితులు ఇలా ఫోన్లు పొగొట్టుకోవడం వన అందులో ఉండే విలువైన సమాచారమంతా దక్కకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, బ్యాంకింగ్ ఇలా అన్నింటిని ఈ సెల్ ఫోన్ లోనే నిర్వహిస్తుంటాం.మరి అలాంటి ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా పరిస్థితి ఏంటి.. అని చాలామంది ఆందోళన పడుతుంటారు. పైగా చోరీకి గురైన స్మార్ట్ ఫోన్ నుంచి డేటా కూడా చోరీకి గురైయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇకపై అలాంటి సమస్యలు లేకుండా రాష్ట్ర పోలీస్‌ శాఖ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్పటి వరకు రాష్ట్రంలో సెల్  ఫోన్ పెగొట్టుకున్న బాధితులు చాలామంది ఉన్నారు. అయితే అలా ఫోన్ పొగొట్టుకున్న వారు ఆ తర్వాత..  ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం పోలీస్ శాఖ తాజాగా  ఓ కొత్త సాంకేతిక పరిజ్ఞానంను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే ‘చార్ట్ బోర్ట్’ అనే యాప్ . ఈ చార్ట్ బోర్ట్ యాప్ ద్వారా పొగొట్టుకున్న సెల్ ఫోన్ తిరిగి పొందవచ్చని తాజాగా రాష్ట్ర పోలీస్ శాఖ సమాచారం అందించారు.  అయితే ఈ చార్ట్ బోర్ట్ అనే యాప్ ను విశాఖపట్నం కమిషనర్ శ్రీకాంత్ ఐపీస్ గారు ప్రవేశపెట్టారు. అయితే ఈ చార్ట్ బోర్డ్ యాప్ లో లాగిన్  అయిన తర్వాత.. హాయి అనే మెసెజ్ పెట్టాలి. అనంతరం ఆ యాప్ లో ఒక ప్రొఫార్మా ఒపెన్ అవుతుంది.

ఇక ఆ ప్రొఫార్మాలో సెల్ ఫోన్ పొగొట్టుకున్న బాధితుల వివరాలను  పూరించాలి. ఆ తర్వాత ఆ ఆప్లికేషన్ సబ్మిట్ చేయాలి. కాగా, సబ్మిట్  చేసిన ప్రొఫార్మా ప్రకారం.. ఆ వివరాలను పోలీసులకు చేరుతుంది. అప్పుడు సెల్ ఫోన్ ట్రాక్ వివరాలు అనేవి పోలీసులకు తెలుస్తోంది. కానీ, చోరీ అయిన ఫోన్ అనేది ఆన్ లో ఉంటే మాత్రం..  అది ఏ ప్రాంతంల్లో ఎక్కడ ఉందనేది సాంకేతిక విజ్ఞానం ఉపాయోగించి ఫోన్ రికవరీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే విశాఖపట్నంలో జరిగిన ఓ స్పెషల్ డ్రైవ్ లో ఫోన్ పొగొట్టుకొని ఆన్ లైన్ లో కంప్లైట్ చేసుకున్న బాధితులకు ఈ చార్ట్ బోర్ట్ పరిజ్ఞానం ద్వారా.. మళ్లీ ఫోన్స్  వాళ్ల చేతికి పోలీసులు అందజేశారు. కాగా, ఈ స్పెషల్ డ్రైవ్ మొదటి విడతలోనే.. 110 ఫోన్స్ అందించడం జరిగింది. ఇక ఫోన్ పొగొట్టుకుని మరి దొరకదు అనుకునే బాధితుల కళ్లలో సంతోషం కలిగించేలా విశాఖ పోలీసులు చేశారు. మరి చోరీ గురయిన ఫోన్ లను మళ్లీ చార్ట్ బోర్ట్ అనే యాప్ ద్వారా రికవరీ పొందడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.