iDreamPost
android-app
ios-app

ఏపీ శ్రీలంక అయిపోతుందని బాబు అండ్ కో బాధపడుతుంటే, లంకేయుల కడుపు నింపేందుకు ఏపీ నుంచి ఆహారధాన్యాల ఎగుమతి

  • Published Apr 06, 2022 | 7:21 PM Updated Updated Apr 06, 2022 | 8:31 PM
ఏపీ శ్రీలంక అయిపోతుందని బాబు అండ్ కో బాధపడుతుంటే, లంకేయుల కడుపు నింపేందుకు ఏపీ నుంచి ఆహారధాన్యాల ఎగుమతి

ఆంధ్రప్రదేశ్ లో అధికారం దక్కదనే దుగ్ధతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగానూ బద్నాం చేసే పనిలో బాబు బ్యాచ్ ఉంది. కానీ ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏపీలో అప్పులు పెరిగిపోతున్నాయని పచ్చమీడియా సహా అందరూ గగ్గోలు పెడుతుంటారు. కానీ ఏపీలో ఆదాయం పెరుగుతున్నట్టుగా రిజిస్ట్రేషన్ల రాబడి సహా జీఎస్టీ వసూళ్ల వరకూ అనేక అంశాలు రుజువు చేస్తాయి. లెక్కలతో మాకు పనిలేదంటూ, కాకి లెక్కలతోనే ఆ సెక్షన్ గోలపెడుతున్న తీరు విడ్డూరంగా ఉంటుంది. ఆ క్రమంలోనే ఏపీ మరో శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్‌ వరకూ అందరిదీ ఒకటే మాట.

శ్రీలంక ఓ దేశం. ఏపీ ఓ రాష్ట్రం. పోనీ ఏపీ ఎందుకు శ్రీలంక అయిపోతుందంటే అప్పుల గురించి అంటారు.నిజంగా ఏపీ అప్పులు అంత ఉన్నాయా అని ఆలోచిస్తే రూ. 2.7 లక్షల కోట్ల బడ్జెట్ లో ఏడాదికి రూ.60 వేల వరకూ వివిధ రకాల అప్పులను ఏపీ ప్రభుత్వం చేస్తుంది. అంటే 20 శాతం సుమారుగా అప్పులు. అదే కేంద్రం లెక్కలు చూస్తే రూ. 39 లక్షల కోట్ల బడ్జెట్. కానీ అప్పులు దాదాపుగా 45 శాతం పైబడి చేస్తున్నారు.అంటే 20 శాతం ఏపీనే శ్రీలంక అంటున్న బాబు, పీకే బ్యాచ్ మరి మోడీ ప్రభుత్వాన్ని ఏమంటాయి. నిజానికి శ్రీలంక సంక్షోభానికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది విదేశీ మారకద్రవ్యం నిల్వల కొరత. ఏపీకి అలాంటి సమస్యలకు అవకాశం లేదు. పైగా ఏపీ నుంచి నానాటికీ ఎగుమతులు పెరుగుతున్నాయి.

ఆ పరంపరలో ఇప్పుడు శ్రీలంకను కూడా ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ తీరం సిద్ధమయ్యింది.ఆహారపదార్థాల సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్రానికి అండగా కాకినాడ తీరం నుంచి బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. అంటే ఏపీనే శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు అండ్ కో కలవర పెడుతున్న వేళ అందుకు భిన్నంగా ఏపీ నుంచే శ్రీలంక కి సహాయం అందుతోంది. తెలుగు నేల మీద నుంచి ఆఫ్రికా, అరేబియా దేశాలతో పాటుగా ఇప్పుడు శ్రీలంక వాసుల కడుపు నింపే రీతిలో ఉదారంగా సాగుతుంటే పచ్చ బ్యాచ్ సూత్రీకరణాలు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి.

వాస్తవాలతో పనిలేకుండా రాష్ట్రం మీద విషం జల్లడమే పనిగా పెట్టుకున్న బ్యాచ్ కి ఇలాంటి విషయాలతోనైనా కళ్లు తెరిస్తే సరిపోతుంది. కానీ అందుకు వారు సిద్ధమవుతారా అన్నది సందేహమేనని చెప్పాల్సి ఉంటుంది.