iDreamPost
android-app
ios-app

బంగాళఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు

  • Published Sep 23, 2024 | 8:43 AM Updated Updated Sep 23, 2024 | 8:43 AM

ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తాజాగా వాతవరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా నేడు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురస్తుందని, ఈ మేరకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది.

ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తాజాగా వాతవరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా నేడు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురస్తుందని, ఈ మేరకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది.

  • Published Sep 23, 2024 | 8:43 AMUpdated Sep 23, 2024 | 8:43 AM
బంగాళఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు

ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన కుండపోత వర్షాలు, వరదల నుంచి కొలుకుంటున్న ప్రజలకు మరోసారి వాతవరణ శాఖ బిగ్ అలెర్ట్ ను జారీ చేసింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడిందని హెచ్చరించింది. ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, ఇప్పటికే గత రెండు రోజుల నుంచి ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిన్న సాయంత్రం, ఈరోజు ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచికొట్టింది. ఈ క్రమంలోనే ఈ వర్షాలు తెలుగు రాష్ట్రల్లో మరో మూడు రోజులు పాటు కొనసాగుతాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం  కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రల్లో భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతవరణ శాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం తుపాను తరహా సుడిగాలులు బంగాళాఖాతంపై ఉన్నాయన్నారు. వీటి వల్ల అల్పపీడనం వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో నేటి నుంచి మరో మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నయని హైదరాబాద్ వాతవరణ శాఖ హెచ్చరించింది.

ముఖ్యంగా నేడు ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, భువనగిరి, సూర్యాపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.  ఇక మరి కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. పిడుగులు కూడా పడొచ్చునని బయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

ఇకపోతే ఏపీలో కూడా అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరింది. కాగా, నేడు ఏపీలో ల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తాయంటున్నారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతవరణ శాఖ తెలిపింది. మరి, తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిస్తాయని వాతవరణ శాఖ హెచ్చరించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.