iDreamPost
android-app
ios-app

భార్య మోసం.. అల్లరి చేయకు, పాలు తాగు అంటూ.. నాన్న బిడ్డకి లెటర్ రాసి!

  • Published Aug 10, 2024 | 5:38 PM Updated Updated Aug 10, 2024 | 5:38 PM

ఏ దాంపత్య జీవితంలో కూడా మూడో వ్యక్తి ప్రమేయం అనేది ఉండకూడదు. కానీ, ఓ దాంపత్య జీవితంలో మూడో వ్యక్తి ప్రమేయం వల్ల. ఓ బిడ్డకు తండ్రి దూరమైయ్యాడు. చివరిగా ఆయన రాసిన లెటర్ కుటుంబ సభ్యుకలు స్థానికులకు కంటతడి పెట్టించింది.

ఏ దాంపత్య జీవితంలో కూడా మూడో వ్యక్తి ప్రమేయం అనేది ఉండకూడదు. కానీ, ఓ దాంపత్య జీవితంలో మూడో వ్యక్తి ప్రమేయం వల్ల. ఓ బిడ్డకు తండ్రి దూరమైయ్యాడు. చివరిగా ఆయన రాసిన లెటర్ కుటుంబ సభ్యుకలు స్థానికులకు కంటతడి పెట్టించింది.

  • Published Aug 10, 2024 | 5:38 PMUpdated Aug 10, 2024 | 5:38 PM
భార్య మోసం.. అల్లరి చేయకు, పాలు తాగు అంటూ.. నాన్న బిడ్డకి లెటర్ రాసి!

ప్రస్తుత కాలంలో రాను రాను సమాజం ఎటు పోతుందో తెలియడం లేదు. ప్రాణంగా చూసుకునే భార్యకు ప్రేమించే భార్త దొరకడం లేదు. తనే సర్వసం అనే బ్రతికే భర్తకు నమ్మకమైన భార్య దొరకడం లేదు. అసలు పవిత్రమైన వైవాహిక బంధనికి విలువ లేకుండా పోయే పరిస్థితిలు నెలకొంటున్నాయి. అయితే వీటన్నింటికి ప్రధాన కారణం ఇల్లీగల్ రిలేషన్. వీటి కారణంగా ఎన్నో జీవితాలు నాశనమవుతున్నాయి. మరెన్నో కాపురాల్లో చిచ్చులు రగులుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. అక్రమ సంబంధంలనే ఊభిలో నిండు ప్రాణాలే పోతున్నాయి.తాజాగా ఈ అక్రమ సంబంధాల వలన ఓ బిడ్డకు తండ్రి దూరమైయ్యాడు. అర్ధంతరంగా తనువు చలించి ఎవ్వరికీ కానీరాని లోకలకు వెళ్లిపోయాడు. మరణంలో కూడా తన కుటుంబ సభ్యులనే తలుచుకుంటూ ఆయన రాసిన లేఖ అందర్నీ కంట తడిపెట్టించింది. ఆ వివరాలేంటో చూద్దాం.

ఏ దాంపత్య జీవితంలో కూడా మూడో వ్యక్తి ప్రమేయం అనేది ఉండకూడదు. కానీ, ఓ దాంపత్య జీవితంలో మూడో వ్యక్తి ప్రమేయం వల్ల ఓ నిండు ప్రాణం బలిగొన్నాది. ప్రాణంగా ప్రేమించిన భార్య, నమ్మిన స్నేహితులు నిలువునా మోసం చేయడంతో హరిప్రకాష్ అనే ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆత్మహత్యకు మందు అతను సెల్ఫీ వీడియో తీసుకొని మరీ తన బాధలను చెప్రపుకున్నారు. అంతేకాకుండా.. ఆ ఆత్మహత్యకు ముందు హరి ప్రకాష్ రాసిన ఆరు పేజిల వాంగ్మూలం అందర్నీ కంట తెప్పిస్తోంది. ఇంతకీ హరిప్రకాష్ ఏం రాశారంటే.. ‘హరిప్రకాష్ అనే నేను ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో ఉద్యోగం చేస్తున్నాను. అయితే నాకు మొదట ఓ వివాహం జరిగింది. కానీ కొన్ని కారణలవల్ల మొదటి భార్యతో విడాకులు తీసుకున్న. దీంతో కొన్నాళలకు గాజువాకలో భర్తు వదిలేసి ఉంటున్న సత్యవతి అనే మహిళ పరిచయమైంది. ఆ మహిళ తన కూతరితో (భువనేశ్వరి) మాట్లాడమని, కలవమని(శారీరకంగా) చెప్పేవారు. ఇక మా ఇద్దరికి వాళ్ల తమ్ముడు కాపలాగా ఉండేవాడు.

కానీ, నిజానికి ఇదంతా నా మొదటి భార్యతో గొడవలు పడిన తర్వాత జరిగింది. అసలు మా ఇద్దరికి గొడవలు కావడానికి కూడా భువనేశ్వరి కారణం. దీంతో నా మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాను. ఆ తర్వాత సత్యవతి తన కూతురు భువనేశ్వరిని పెళ్లి చేసుకోమని, తనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని నన్ను నమ్మించి, భువనేశ్వరికి, నాకు సత్యవతికి పెళ్లి చేశారు. నిజానికి భువనేశ్వరికి ఇది రెండో వివాహం. అయితే ఎలాంటి కట్నం లేకుండా సొంత డబ్బులతో అన్నవరంలోని 2019లో పెళ్లి చేసుకున్నాం. ఇక 2020లో మాకు పాప పుట్టింది. అయితే పాప పుట్టిన రెండేళ్లకు నాకు, నా భార్యకు గొడవలు జరుగుతున్నాయి. నా భార్య భువనేశ్వరికి తరుచు తన బావ అకౌంట్లోకి డబ్బులు వేసేవారు. దానిని నేను ప్రశ్నించగా.. నాకు ఫోన్ ఇవ్వడం మానేసింది.  ముఖ్యంగా 24 గంటలూ వాట్సప్ చాటింగ్, ఫోన్లో మాట్లాడుతూ ఉండేదని.. ఏమైనా ప్రశ్నిస్తే నీకెందుకు, నా లైఫ్ అనేదంటూ హరిప్రకాష్ వాపోయారు.

అంతేకాకుండా.. తన స్నేహితుడు రాజేష్‌ తో కూడా నా భార్య తరుచు ఫోన్ కాల్స్, చాటింగ్ చేసేది. ఇక స్నేహితుడు అని నమ్మితే అతను కూడా న్నను మోసం చేశాడంటూ బాధపడ్డారు. అందుకే చివరకు ఏ గత్యంతరం లేక బలవన్మరణానికి పాల్పడుతున్నాను అని పేర్కొన్నాడు. ఇక చివరిగా ఆ లేఖలో.. అమ్మా, అన్నయ్యా, చెల్లి, నిక్కి, మను  మీరందరూ సంతోషంగా ఉండాలి. నేను ఎక్కడ ఉన్నా మీ మంచినే కోరుకుంటాను. నా చివరి కోరిక నా పాప భవిష్యత్తు నీదే చెల్లెమ్మ. నన్ను క్షమించు. మరో జన్మ ఉంటే నీకు కొడుకు, అన్న, తమ్ముడిగానో పుడతాను. నిక్కి, మను మీరు బాగా చదువుకోండి, మంచిగా బతకండి. అమ్మని, మామయ్యను, అమ్మమ్మను చక్కగా చూసుకోండి.  నా పాపను కంటికి రెప్పాలా కాపాడుతారని మీ అందరికీ అప్పగించి ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నా.

నన్ను మన్నించండి. అమ్ము తల్లి ఐ లవ్ యూ.. ఐ మిస్ యూ.. జాగ్రత్తగా ఉండు, అల్లరి చేయకు, పాలు తాగు, బువ్వ తిను, ఎవరిని ఏవి అనకు, బాగా చదువుకో..’ అంటూ హరిప్రకాష్ రాసిన లేఖ కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇక ఈ లేఖ చూసిన కుటుంబ సభ్యులకు, స్థానికులకు కంటతడి పెట్టించింది. ఇదిలా ఉంటే.. మరోవైపు ఈ ఘటనపై హరిప్రకాష్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ద్వారకా జోన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం హరి ప్రకాష్ మృతదేహన్ని మార్చురీకి తరలించారు. హరిప్రకాష్ భార్య భువనేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న స్నేహితుడు రాజేష్ కోసం గాలిస్తున్నారు.