iDreamPost
android-app
ios-app

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై ఉచితంగానే సచివాలయాల్లో సేవలు!

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై ఉచితంగానే సచివాలయాల్లో సేవలు!

ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. అలానే జగన్ పరిపాలనలో సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలు కీలకంగా పని చేస్తున్నాయి. ఈ రెండింటి ద్వారానే పథకాలను ప్రభుత్వం ప్రజలకు చేరువ చేస్తుంది. ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. గతంలో ఏదైన సమస్య ఉంటే మండల ఆఫీస్ వరకు  వెళ్లాల్సి ఉండేది. కానీ సచివాలయ వ్యవస్థతో ప్రజలకు ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. తాజాగా సచివాలయాల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఏర్పాటు చేసిన వాటిల్లో సచివాలయ వ్యవస్థ ఒకటి. దీని ద్వారా ఎంతో మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. అంతేకాక ప్రభుత్వానికి, ప్రజకు సచివాలయ వ్యవస్థ వారథి ఉంది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేందుకు ఈ వ్యవస్థ ఎంతో  కీలకంగా మారింది. ఇలాంటి సచివాలయాల విషయంలో జగన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న సురక్ష సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో జారీ చేసే ధృవీకరణ పత్రాలను ఉచితంగా ఇవ్వనున్నారు. ముఖ్యంగా కుల, నివాస, ఆదాయ, బర్త్ సర్టిఫికేట్, మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స మ్యారేజ్ సర్టిఫికేట్, కుటుంబ సభ్యుల సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ అప్డేట్, కొత్త రేషన్ కార్డు నమోదు వంటివి ఉచితంగా అందిస్తారు. అలానే  కౌలు రైతుల గుర్తింపు కార్డులను కూడా ఫీజు లేకుండా ఉచితంగానే ఇవ్వనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజుల పాటు  పాటు ఈ ఉచిత సేవలు సచివాలయాల్లో అందుబాటులో ఉండనున్నాయి.  గ్రామ, వార్డు సచివాలయాల్లో  అనేక సేవలు అందిస్తున్నారు. ఈ సేవలకు గాను కొంత రుసుము తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం  నెల రోజుల పాటు సర్టిఫికేట్లను ఉచితంగా అందిచేలా కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఏపీ  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.