iDreamPost

కర్ణాటకలో దారుణం: డాక్టర్స్ నిర్లక్ష్యంతో మరో డాక్టర్ ప్రాణాలు పోయాయి!

  • Published Jun 25, 2024 | 12:31 PMUpdated Jun 25, 2024 | 12:31 PM

ఇటీవల కాలంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందిన రోగుల గురించి వినే ఉంటాం. కానీ, తాజాగా జరిగిన ఓ సంఘటనలో మాత్రం రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యురాలికే.. ఆసుపత్రిలో డైక్టర్ల నిర్లక్ష్య వైఖరి చూపించడంతో ప్రాణాలు విడిచే పరిస్థితి ఏర్పడింది. ఇంతకి ఏం జరిగిందంటే..

ఇటీవల కాలంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందిన రోగుల గురించి వినే ఉంటాం. కానీ, తాజాగా జరిగిన ఓ సంఘటనలో మాత్రం రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యురాలికే.. ఆసుపత్రిలో డైక్టర్ల నిర్లక్ష్య వైఖరి చూపించడంతో ప్రాణాలు విడిచే పరిస్థితి ఏర్పడింది. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Jun 25, 2024 | 12:31 PMUpdated Jun 25, 2024 | 12:31 PM
కర్ణాటకలో దారుణం: డాక్టర్స్ నిర్లక్ష్యంతో మరో డాక్టర్ ప్రాణాలు పోయాయి!

సాధారణంగా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నా, ఒంట్లో కస్తా నలతగా ఉన్నా ముందుగా గుర్తుకు వచ్చేది వైద్యుడు. ​ఎందుకంటే.. ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తక్షణమే వైద్యం అందిచి కాస్త మెరుగుడేలా చేస్తారు వైద్యలు. అందుకే కనిపించని ఆ దేవుడి కంటే ముందు వైద్యుడినే రోగులు మొక్కుతుంటారు. కానీ,ప్రస్తుత కాలంలో రోగుల పట్ల వైద్యులు చూపిస్తున్న వైఖరి అడుగడున అద్దం పట్టినట్టుగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ, తాజాగా జరిగిన ఓ సంఘటనలో మాత్రం రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యురాలికే.. ఆసుపత్రిలో డైక్టర్ల నిర్లక్ష్య వైఖరి చూపించడంతో ప్రాణాలు విడిచే పరిస్థితి ఏర్పడింది. ఇంతకి ఏం జరిగిందంటే..

తాజాగా మంగళూరులోని మెడిసిన్ పీజీ చదువుతున్న వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన వైద్య విద్యార్థిని డెంగీ జ్వరంతో మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆ వైద్యురాలు మృతి చెందిందని ఆమె కుటుంబీకులు ఆరోపించారు.అయితే మృతి చెందిన వైద్యురాలు.. మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పి. మాధురి, వెంకటరమణా రెడ్డిల కుమార్తె పడిగపాటి సృజని (27) అని సమాచారం. ఇక మృతురాలు సృజని మంగళూరు వద్ద కేవీజీ మెడికల్‌ కాలేజీలో గైనకాలజీలో పీజీ విద్యార్థిని. కాగా, ఈమెకు నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో అదే మెడికల్‌ కాలేజీలోనే వైద్యం చేయించుకుంది. దీంతో డెంగీ అని నిర్ధారణ కావడంతో పాటు ప్లేట్ లేట్స్ కూడా తగ్గిపోయాయి. పైగా సకాలంలో వైద్యం అందించకపోవడంతో ఆరోగ్యం విషమించిందని కాలేజీ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందిచారు.

దీంతో విషయం తెలిసిన తల్లిదండ్రులు  హైదరాబాద్ నుంచి మంగళూరుకు బయలుదేరారు. కానీ, అక్కడ డాక్టర్లు చేతులెత్తేసారు. పైగా మెరుగైన వైద్యం కోసం మంగళూరుకు వెళ్లాలని సూచించారు. అయితే వెంటనే వైద్య సిబ్బంది ఆమెను మంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో కోమాలోకి చేరుకుంది. ఇక కొన ఊపిరితో ఉన్న కుమార్తె ను చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అలాగే చివరి మాటలకు కూడా నోచుకోలేదని బోరున విలపించారు. అయితే ఆ వైద్యురాలు శుక్రవారం జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కన్ను మూసిందని తల్లిదండ్రులు తెలిపారు. ఇకపోతే తమ బిడ్డకు సరిగా వైద్యం చేయలేదని తల్లిదండ్రులు మంగళూరు నార్త్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కాలేజీకి వెళ్లి విచారణ జరిపారు.

కాగా, సృజని ట్రీట్‌మెంట్‌ గురించి వైద్యులు సరైన సమాధానం చెప్పలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇక అదివారం తెల్లవారు జామున స్వగ్రామం పోట్లదుర్తికి మృతదేహాన్ని తీసుకువచ్చి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ విషయం తెలిసిన పలువురు ఒక డాక్టర్ కే సకాలంలో వైద్య అందకపోవడం చాలా బాధకరం. పైగా డాక్టరికే మెరుగైనా వైద్యం అందించి కాపాడలేకపోయినా వైద్యులు సామాన్యులకు ఏం వైద్యం చేస్తారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి, డాక్టర్లు నిర్లక్ష్యంతో డెంగి జ్వరం బారినపడి వైద్యురాలు మృతి చెందిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి