Uppula Naresh
Uppula Naresh
గుర్తింపు లేని మోసపూరిత సంస్థల నుంచి విద్యను అభ్యసించే యువతను రక్షించడమే యూజీసీ ప్రధాన కర్తవ్యం. ఇందులో భాగంగానే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల దేశ వ్యాప్తంగా యూజీసీ చట్టానికి విరుద్దంగా నడిపిస్తున్న ఫేక్ యూనివర్సిటీలను గుర్తించింది. కాగా, దేశ వ్యాప్తంగా దాదాపు 20 విశ్వవిద్యాలయాలను నకిలీగా నడిపిస్తున్నారని యూజీసీ బుధవారం ప్రకటించింది. ఈ క్రమంలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏపీలో ఉన్న ఫేక్ విశ్వవిద్యాలయాలను కూడా గుర్తించి ప్రకటించింది.
అందులో గుంటూరులో జిల్లా కాకుమానివారితోటలో ఉన్న క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డిమ్డ్ యూనివర్ వర్సిటీ, విశాఖపట్నంలో ఉన్న ఉన్న బైబిల్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా విశ్వవిద్యాలయాలు నకిలీ యూనివర్సిటీలని యూజీసీ ప్రకటించింది. ఇక యూజీసీ దేశ వ్యాప్తంగా గుర్తించిన ఫేక్ యూనిర్సిటీలో ప్రధానంగా ఢిల్లీలో అత్యధికంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 8 ఫేక్ విశ్వవిద్యాలయాలు ఉండడం విశేషం. అయితే, కొన్ని నకిలీ యూనివర్సిటీలు యూజీసీ చట్టానికి విరుద్దంగా విశ్వవిద్యాలయాలను నడిపిస్తున్నాయని, ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో చదివి విద్యార్థులు మోసపోకూడదని యూజీసీ గ్రాంట్స్ కమిషన్ యువతకు సూచించింది.
ఇది కూడా చదవండి: విద్యార్థులకు ఏటా రూ. 1.25 లక్షల స్కాలర్‌షిప్ ఇచ్చే పథకం.. ఆగస్టు 10 వరకే అవకాశం