అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి చివరకు డ్రాగన్ దేశం చైనా తలొంచాల్సొచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి మూలాలపై విచారణ చేయాల్సిందేనంటూ ట్రంప్ చేసిన డిమాండ్ ను మొదట్లో చైనా కొట్టేసింది. వైరస్ కు పుట్టినల్లైన చైనాలో ఎక్కడి నుండి వైరస్ మొదలైందనే విషయంలో విచారణ చేయాల్సిందేనంటూ ట్రంప్ మొదటి నుండి చేస్తున్న డిమాండ్ కు ప్రపంచదేశాలు కూడా మద్దతు పలికాయి. అయితే ఎన్ని దేశాలు డిమాండ్ చేసిన చైనా చాలా కాలం లెక్క చేయలేదు. […]
దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజులో 5,611 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,750కి కు చేరింది. కాగా కరోనా కారణంగా 3,303 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 146 మంది మరణించారు. కరోనా వైరస్ బారినుండి 42,297 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 61,149 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో […]
’మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ .. స్లోగన్ తో అగ్రరాజ్యం బలోపేతానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు మొదలుపెట్టాడు. కరోనా వైరస్ దెబ్బకు అమెరికాలోని చాలా వ్యవస్ధలు కుప్ప కూలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఉత్పత్తి, ఆటోమొబైల్, సేవలు, మెడికల్, టూరిజం ఇలా చాలా వ్యవస్ధలు దెబ్బతినటంతో దేశం మొత్తం మీద దాదాపు 3 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధిని కోల్పోయినట్లు ఓ అంచనా. దాంతో కరోనా వైరస్ నుండి అమెరికా కోలుకున్నా మళ్ళీ ఆర్ధిక వ్యవస్ధను […]
ఫెడరల్ కోర్టు జడ్జిగా సరిత కోమటిరెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పదవులకు నామినేట్ చేశారు. న్యూయార్క్‌లోని ఓ ఫెడరల్ కోర్టు జడ్జి పదవితో పాటుగా ప్రపంచ బ్యాంకులో రుణాలు అందించే విభాగమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకుకు అమెరికా ప్రతినిధి పదవి మరియు పారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ)కు తన రాయబారి పదవులకు భారతీయ అమెరికన్లను ట్రంప్ నామినేట్ చేశారు. ప్రముఖ మహిళా న్యాయవాది […]
ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ చైనా లేబొరేటరీ నుంచి వచ్చిందని, ఇలాంటి ఎన్నో ప్రాణాంతక సూక్ష్మజీవులు చైనా దగ్గర ఉన్నాయని, జీవాయుధ యుద్ధంలో వాటిని ఆయుధాలుగా మార్చి వాడుకోవడం చైనా పాలకుల ప్రణాళిక అని అమెరికా అధ్యక్షుడు ట్రంపుతో సహా చాలామంది ఆరోపిస్తున్నారు. 1925లో చేసిన జెనీవా ఒప్పందం రసాయన, జీవ ఆయుధాల ఉత్పత్తి వినియోగం మీద నిషేధం విధించినా చాలా చిన్నా పెద్ద దేశాలు ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కి, అలాంటి ప్రమాదకర […]
గత రెండునెలల నుండి అగ్ర రాజ్యం అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తున్న ఈ తరుణంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షలకు చెరువైంది. న్యూయార్క్ న్యూజెర్సీ లాంటి నగరాల్లో కరోనా ఉధృతి ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ఈ నెపధ్యంలో కొంత కాలంగా దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో కరోనా తీవ్రత కొంచెం తక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో స్థానిక ప్రజలు స్వేచ్చ వైపే మొగ్గు చూపారు. దీంతో స్థానిక […]
కరోనా వైరస్ ప్రారంభ సమయంలో దాన్ని తేలిగ్గా తీసుకుని తన నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది ప్రాణాలు పోయేందుకు కారణమైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తిరిగి మళ్ళీ అదే బాటలో పయనిస్తూ ఉన్నట్లుగా ఆయన మాటల ద్వారా అర్ధం అవుతోంది. అమెరికాలో ప్రతిరోజు వేలాది మందికి వైరస్ సోకుతుంది. వేలాది మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 33 లక్షల మందికి ఈ వైరస్ సోకగా.. అందులో మూడు వంతుల్లో ఒక వంతు […]
కరోనా వైరస్ తాకిడి ఇప్పుడు మొత్తం వ్యవస్థనే తల్లకిందులు చేసింది. చాలామంది అంచనాలు, ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ తారుమారయ్యాయి. అదే సమయంలో అన్ని చోట్లా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. లాక్ డౌన్ పాటిస్తున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం తగ్గడం లేదు. ఎందుకు తగ్గడం లేదనేది ఎవరికీ అంతుబట్టని వ్యవహారంగా మారింది. తొలుత విదేశీ యాత్రికులు, ఆ తర్వాత మర్కజ్ నుంచి వచ్చిన వారు కారణాలుగా స్పష్టత ఉంది. కానీ ఇప్పుడు అలాంటి క్లారిటీ కూడా […]
కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికాలో 50 వేలమంది చనిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఏప్రిల్ నెల 25 రోజుల్లోనే 46 వేలమంది మృతి చెందటం సంచలనంగా మారింది. గడచిన 55 రోజుల్లో దేశం మొత్తం మీద సుమారు 9 లక్షల మంది బాధితులు నమోదయ్యారు. బాధితుల్లో కానీ చనిపోయిన వారిలో కానీ న్యూయార్క్ రాష్ట్రందే అగ్రస్ధానం. తర్వాత న్యూజెర్సీ రాష్ట్రంలోనే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం మీద వైరస్ అమెరికాను వణికించేస్తోంది. పది […]
కరోనా వైరస్ నేపధ్యంలో అగ్రరాజ్యం అమెరికా మీద దాడి జరిగిందని అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ ప్రకటించాడు. గురువారం అమెరికా మొత్తం మీద 2416 మంది చనిపోయారు. గతంలో అత్యధికంగా సుమారు 4356 మంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఒక్క రోజులు అంతమంది కరోనా వైరస్ దాడికి చనిపోయిన వారి సంఖ్యలో అమెరికాదే ప్రపంచ రికార్డని చెప్పాలి. నిజానికి చనిపోయిన వారి సంఖ్యను కూడా ప్రపంచరికార్డని చెప్పుకోవటం దురదృష్టమనే చెప్పుకోవాలి. తర్వాత బాధితులు, మృతుల సంఖ్య […]