Uppula Naresh
ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి వరుణ్ రాజ్ అనే యువకుడు గత నెల 30న హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఈ యువకుడు బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే?
ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి వరుణ్ రాజ్ అనే యువకుడు గత నెల 30న హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఈ యువకుడు బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే?
Uppula Naresh
ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి వరుణ్ రాజ్ అనే యువకుడు అమెరికాలో పబ్లిక్ జిమ్ లో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ప్రాణాలతో కొట్టుమిట్టాడిన వరుణ్ రాజ్ బుధవారం ప్రాణాలు విడిచాడు. ఆ యువకుడు మృతి చెందండంతో అతని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు జోర్డాన్ ఆండ్రేడ్ ను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
మీడియా కథనం ప్రకారం.. ఖమ్మం పట్టణంలో మామిళ్లగూడెం ప్రాంతంలో వరుణ్ రాజ్ (29) అనే యువకుడు నివాసం ఉండేవాడు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తుండేవారు. అయితే ఈ యువకుడు ఎంఎస్ చదవడానికి 2022లో అమెరికా వెళ్లాడు. అప్పటి నుంచి అతడు ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో చదువుతూ స్థానికంగా పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడు. ఇదిలా ఉంటే.. గత నెల 30న వరుణ్ రాజ్ పబ్లిక్ జిమ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇదే సమయంలో అక్కడే ఉన్న నిందితుడు జోర్డాన్ ఆండ్రేడ్ అనే వ్యక్తి కత్తితో వరుణ్ రాజ్ కణతిపై పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ వరుణ్ రాజ్ ఆస్పత్రికి తరలించారు. అయితే 9 రోజుల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఈ వరుణ్ రాజ్.. పరిస్థితి విషమించడంతో బుధవారం ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలుసుకుని మృతుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఎట్టకేలకు నిందితుడు జోర్డాన్ ఆండ్రేడ్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో మృతుని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.