Krishna Kowshik
గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర హ, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మయ్ శ్రీ గురవే నమహ అని గురువును దైవంగా భావించి.. ఆయన నుండి పాఠాలు నేర్చుకుని.. తమ జీవితానికి సోపానాలుగా మార్చుకోవాలి విద్యార్థులు. కానీ నేటి కాలంలో.. వీరి మధ్య బంధం..
గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర హ, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మయ్ శ్రీ గురవే నమహ అని గురువును దైవంగా భావించి.. ఆయన నుండి పాఠాలు నేర్చుకుని.. తమ జీవితానికి సోపానాలుగా మార్చుకోవాలి విద్యార్థులు. కానీ నేటి కాలంలో.. వీరి మధ్య బంధం..
Krishna Kowshik
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. అంటే తల్లిదండ్రుల తర్వాత గౌరవించేది గురువులనే. అలాగే గురువును మించిన దైవం లేదూ అని కూడా అంటారు. ఉపాధ్యాయుడు కేవలం విద్యా బుద్దులే నేర్పడమే కాకుండా.. విద్యార్థులు చేసే తప్పిదాలను సరిదిద్దుతారు. వారిని చైతన్య వంతులుగా చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో తమను నడిపించే గురువు కచ్చితంగా ఒకరు ఉంటారు. కానీ నేటి కాలంలో విద్య కమర్షియల్ అయిపోవడంతో.. ఉపాధ్యాయులు కూడా ఆ పంథాలోనే నడుస్తున్నారు. పాఠాలు చెప్పే ముసుగులో కొంత మంది టీచర్లు విద్యార్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇప్పటి వరకు విద్యార్థినులను చెరపట్టిన టీచర్ గురించి విన్నారు కానీ.. స్టూడెంట్ తో లైంగిక సంబంధం పెట్టుకున్న ఉపాధ్యాయురాలి గురించి విన్నారా? ఆ బాధితుడు ఇప్పుడు నోరు మెదపడంతో.. ఆ మహిళా టీచర్ అరెస్టు జరగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకంది. మోంట్‌గోమేరీ కౌంటీ డిపార్ట్ మెంట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెలిస్సా మేరీ కర్టిస్ 2015లో మాంట్‌గోమేరీ కౌంటీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా ఉన్నప్పుడు విద్యార్థితో లైంగిక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఆమెకు 22 ఏళ్లు, విద్యార్థికి 14 ఏళ్లు. బాధితుడు తనపై ఎనిమిదేళ్ల క్రితం అంటే తాను 8వ తరగతి చదువుతున్న సమయంలో లైంగిక దాడి జరిగినట్లు ఫిర్యాదు చేశాడు.
తను మైనర్‌గా ఉన్నప్పుడు మెర్టీ కర్టీస్ తనతో లైంగిక సంబంధం పెట్టుకుందని ఆరోపణలు చేశాడు. 2015లో జనవరి నుండి మే వరకు కర్టిస్ తన వాహనంతో పాటు పలు నివాసాల్లో 20 సార్లు కన్నా ఎక్కువ శారీరక సంబంధం నెరిపిందని పేర్కొన్నాడు. మద్యం, గంజాయిని ఇచ్చి.. లైంగిక వాంఛ తీర్చుకున్నట్లు వెల్లడించాడు. ఈ ఆరోపణలపై గత నెలలో విచారణ ప్రారంభించిన పోలీసులు.. అక్టోబర్ 31న ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేశారు. అయితే ఆమె పలు స్కూళ్లలో ఉపాధ్యాయురాలిగా పనిచేయడంతో మరికొంత మంది బాధితులు ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 2017 నుండి ఆమె తమ స్కూల్లో పని చేయడం లేదని మాంట్‌గోమేరీ కౌంటీ పబ్లిక్ ప్రతినిధి వెల్లడించారు.