iDreamPost
android-app
ios-app

ప్లీజ్.. మా బిడ్డ మృతదేహాన్ని ఇప్పించండి.. తెలంగాణ ప్రభుత్వానికి వేడుకోలు

ప్లీజ్.. మా బిడ్డ మృతదేహాన్ని ఇప్పించండి.. తెలంగాణ ప్రభుత్వానికి వేడుకోలు

తల్లిదండ్రులు తినో తినకో కష్టపడి పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. తమ కష్టం పిల్లలు పడకూడదని భావించి, వారు ఎంత వరకు చదువుకోవాలని భావిస్తున్నారో అంత వరకు ఆర్థికంగా సాయంగా నిలుస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివేందుకు, మంచి ఉద్యోగాలు సంపాదించి కుటుంబానికి అండగా నిలిచేందుకు విదేశాలకు వెళతామంటే.. ఇల్లు, బంగారం, పొలాలు తాకట్టు పెట్టి మరీ పంపిస్తున్నారు. కానీ ఊహించని విధంగా కాలం వారితో ఆటలు ఆడుతోంది. గొప్ప చదువులు చదివి, తమ పేరు నిలబెట్టేలా చేస్తారని గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు.. వారే లేరని తెలిస్తే.. ఆ వేదన వర్ణనాతీతం. ఇదే జరిగింది ఈ దంపతుల విషయంలో. కొడుకు ఇష్టపడ్డాడని ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు పంపారు. కానీ ఆ కుమారుడు వారికి పుత్రశోకాన్ని నింపుతూ.. మరణించాడు. అతడి కడసారి చూపుకు నోచుకునేందుకు.. ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.

హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన కంగుల బాల రేవంత్ కుమార్ (22) పై చదువుల కోసం అమెరికాలోని చికాగోకు వెళ్లాడు. అక్కడి రూజ్ వెల్డ్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేస్తున్నాడు.  ఈ నెల 28న గుండెపోటుతో తన గదిలోనే ప్రాణాలు విడిచాడు. ఈ విషయం భారత్‌లోని అతడి తల్లిదండ్రులకు సమాచారం అందింది. దీంతో వారంతా గొల్లుమన్నారు. అయితే చిన్నా చితకా వ్యాపారం చేసుకునే రేవంత్ తల్లిదండ్రులు.. మొత్తం ఖర్చు పెట్టి.. కొడుకుని పై చదువులకు పంపించారు. కానీ ఇంతలోనే కుమారుడు విగత జీవిగా మారాడని తెలిసి కుంగిపోయారు. తమ కొడుకు చివరి చూపు కోసం ఆవేదన చెందుతున్నారు. తాము అక్కడ నుండి కుమారుడి మృతదేహం తీసుకువచ్చే స్థోమత లేకపోవడంతో.. తమ కుమారుడి మృతదేహాన్ని తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.