iDreamPost
android-app
ios-app

వీడియో: కారును ఢీ కొట్టిన విమానం!

విమానం రోడ్డుపై వెళ్తున్న ఓ కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న డ్రైవర్ తో పాటు మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కారును విమానం ఢీ కొట్టడం ఏంటని ఆశ్యర్యపోతున్నారా? అసలేం జరిగిందంటే?

విమానం రోడ్డుపై వెళ్తున్న ఓ కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న డ్రైవర్ తో పాటు మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కారును విమానం ఢీ కొట్టడం ఏంటని ఆశ్యర్యపోతున్నారా? అసలేం జరిగిందంటే?

వీడియో: కారును ఢీ కొట్టిన విమానం!

మాములుగా రోజు అక్కడక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వేగంగా వచ్చి కారును లారీ ఢీ కొట్టడమో, లేదంటే కారు బైక్ ను ఢీ కొట్టడమో వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి రోడ్డు ప్రమాదాల్లో కొందరు తీవ్రంగా గాయపడుతుంటే.., మరి కొందరు మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ, ఓ చోట మాత్రం విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన విమానం రోడ్డుపై వెళ్తున్న ఓ కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న డ్రైవర్ తో పాటు మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే కాకుండా ఆ కారు పూర్తిగా ధ్వంసమైంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కారును విమానం ఢీ కొట్టడం ఏంటని ఆశ్యర్యపోతున్నారా? ఇంతకు ఈ ఘటన జరిగింది? అసలేం జరిగిందంటే?

పూర్తి వివారాల్లోకి వెళ్తే.. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని మెక్ కిన్నీ నగరం. ఇక్కడే ఉన్న ఏరో కంట్రీ ఎయిర్ పోర్ట్ నుంచి ఇటీవల IV-పీ ప్రాప్ జెట్ విమానం గాల్లోకి వెళ్లింది. అయితే అది కొద్ది దూరం ప్రయాణించిందో లేదో.. ఉన్నట్టుండి ఆ విమానంలో సాంకేతి లోపం తలెత్తింది. దీంతో ఫైలెట్ అప్రమత్తమై వెంటనే ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఇదే విషయాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులకు తెలియజేశారు. అయితే ఫైలెట్ వెంటనే విమానాన్ని రన్ వే పై దింపాడు. కానీ, ఆ సమయంలో ఆ విమానం అదుపులోకి రాలేదు. దీంతో ఎయిర్ పోర్టు కంచె దాటి పక్కనే ఉన్న రోడ్డుపై దూసుకెళ్లింది.

ఇదే సమయంలో ఎదురుగా వేగంగా దూసుకొస్తున్న ఓ కారును విమానం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్ తో పాటు మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు అంబులెన్స్ ద్వారా గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆ రోడ్డుపై ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయింది. దీన్ని గమనించిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అనంతరం ఈ ప్రమాదంపై ఎఫ్ఏఏ పరిశోధకులు సైతం వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి? ఆ విమానంలో ఏ రకమైన సాంకేతిక లోపం సంభవించిందనే దానిపై పూర్తి విచారణ చేపట్టారు. మరో విషయం ఏంటంటే? అమెరికాలో ఇలాంటి ప్రమాదాలు గతంలో అనేకం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇకపోతే.. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.