iDreamPost
android-app
ios-app

MRI మిషన్‌తో నర్స్ భయానక అనుభవం.. చావు తప్పినట్లయ్యింది

ప్రతి వస్తువు ఏదో ఒక విషయంలో కంగారు పెట్టిస్తుంది. ప్రాణంతకంగా మారుతుంది. గ్యాస్, ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్, చివరకు సెల్ ఫోన్ వంటి ఆధునిక వస్తువులు.. మనిషి ప్రాణాలను బలిగొన్న సంగతి విదితమే. అలాగే వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలో ఒకటైన ఎంఆర్ఐ వల్ల కూడా భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రతి వస్తువు ఏదో ఒక విషయంలో కంగారు పెట్టిస్తుంది. ప్రాణంతకంగా మారుతుంది. గ్యాస్, ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్, చివరకు సెల్ ఫోన్ వంటి ఆధునిక వస్తువులు.. మనిషి ప్రాణాలను బలిగొన్న సంగతి విదితమే. అలాగే వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలో ఒకటైన ఎంఆర్ఐ వల్ల కూడా భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

MRI మిషన్‌తో నర్స్ భయానక అనుభవం.. చావు తప్పినట్లయ్యింది

అవసరాలు, ఆధునికత కలిసి ప్రతి విషయంలోనూ కొత్త పుంతలు తొక్కేలా చేశాయి. నూతన ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. ప్రతి వస్తువు మార్కెట్‌లోకి వచ్చినప్పుడు తొలుత ఆందోళన కలగడం, కలిగించడం సహజమే. అలవాటు అయిపోతేనే దానికే చుక్కలు చూపిస్తుంటారు జనాలు. అలాగే వైద్య రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు పరీక్షల కోసం గంటలు గంటలు వేచి చూడాల్సిన అవసరం లేకుండా పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. అటువంటి వాటిలో ఒకటి ఎంఆర్ఐ స్కాన్. వలయాకరంలో ఉండే ఈ మిషన్‌లోకి మనుషులను పంపితే..ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాల ద్వారా శరీర అవయవాలను స్కాన్ చేస్తుంది.

ఈ యంత్రం అయస్కాంత శక్తిని కలిగి ఉండటం వల్ల సమీపంలోని వస్తువులను తనలోనికి లాక్కుంటుంది. ఇదే ఓ నర్సు ప్రాణం మీదకు తెచ్చింది. నర్సును అమాంతం మిషన్ తన వైపుకు లాక్కొంది. ఫిబ్రవరిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. రెడ్ వుడ్ సిటీలోని కైజర్ పర్మినెంట్ ఫెసిటిలీలోని ఎంఆర్ఐ స్కానింగ్ రూంలో రోగి ఉండగా.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు ఐనా సెర్వాంటేస్. అయితే ఉన్నట్టుండి ఐరెన్ బెడ్.. మెల్లిగా లాక్కోవడం మొదలు పెట్టింది ఎంఆర్ఐ స్కాన్. అయితే రోగి వెంటనే గ్రహించి దిగిపోగా.. అది వేగంగా.. నర్సు వైపు కదిలింది. దీంతో ఆమె బెడ్, ఎంఆర్ఐ స్కాన్‌కు మధ్య ఇరుక్కుపోయారు.

దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ బెడ్ తో పాటే తనను లాక్కునేందుకు మిషన్ ప్రయత్నించిందని పేర్కొంది. ఆమెకు శస్త్ర చికిత్స చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా, కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన పరిశోధనల్లో రెడ్ వుడ్ సిటీ సెంటర్ రేడియోలాజిక్ సేవలను సరైన పద్ధతిలో అందించడం లేదని తేలింది. గతంలో కూడా అనేక పొరపాట్లు జరిగినట్లు పేర్కొంది. ఘటన సమయంలో గదిలో ఎంఆర్ఐ సిబ్బంది ఎవ్వరూ లేరని కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇది ఎంఆర్ఐ భద్రతా విధానాలను ఉల్లంఘించిందని నివేదిక తెలిపింది.