iDreamPost
android-app
ios-app

Nani: అమెరికాకి న్యాచురల్‌ స్టార్ నాని ప్రయాణం.. ఎందుకంటే?

  • Published Dec 06, 2023 | 2:02 PM Updated Updated Dec 06, 2023 | 8:53 PM

తెలుగు ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నాని దసరా సినిమాతో మంచి విజయం అందుకున్నారు. చాలా గ్యాప్ తీసుకొని ప్రస్తుతం హాయ్ నాన్న మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నాని దసరా సినిమాతో మంచి విజయం అందుకున్నారు. చాలా గ్యాప్ తీసుకొని ప్రస్తుతం హాయ్ నాన్న మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Nani: అమెరికాకి న్యాచురల్‌ స్టార్ నాని ప్రయాణం.. ఎందుకంటే?

భారీ అంచనాలతో 7వ తేదీన విడుదల కాబోతున్న నాని లేటెస్ట్ స్టారర్ హాయ్ నాన్న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా అమెరికాలో అభిమాన ప్రేక్షకుల కోసం నాని ఓ వీడియోని విడుదల చేయడం విశేషం. ఈ వీడియోలో నాని అమెరికాలో తెలుగువారిని ఉద్దేశిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. హాయ్ నాన్న సినిమా గురించి మాట్లాడుతూ.. గతంలో విడుదలైన తన  చిత్రం దసరాని ఆదరించినట్టే హాయ్ నాన్న చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. ఈ మూవీ ఎమోషన్స్ తో కూడుకుందని.. ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా అవుతుందని అన్నారు. ఇటీవల ఈ చిత్రానికి  ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వివరాల్లోకి వెళితే..

‘’యుఎస్ఏ లో తెలుగు సినిమాలు చూసే అందరికీ  హాయ్…లాస్ట్ టైం నేను యుఎస్ లో మీ అందరితో కలసి నేను లోకల్ సినిమా చూసే అవకాశం నాకు దొరికింది. అప్పుడు నిన్ను కోరి సినిమా షూటింగ్ కోసం వచ్చి అక్కడే ఉన్న కారణంగా మిమ్మల్ని అందరినీ కలిసే ఛాన్స్ లభించింది. కానీ ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. మిమ్మల్ని కలవలేకపోయాను. అయినా సరే నాకు మంచి సక్సెస్ లు అందించారు. కానీ, ఈ సారి అక్కడ ఉన్నాను కాబట్టి మిమ్మల్న కలవడం కాదు. మిమ్మల్ని కలవడం కోసం, మీతో హాయ్ నాన్న చూడ్డం కోసమే యుఎస్ వస్తున్నాను. మీతో కలసి సినిమా చూసి ఎంజాయ్ చెయ్యడానికే వస్తున్నాను. ఆ మెమొరీస్ తోనే తిరిగి ఇండియా వస్తాను. హాయ్ నాన్న సినిమాని భారీగా నిర్మాతలు అక్కడ రిలీజ్ చేస్తున్నారు. దసరాకి బ్రహ్మరథం పట్టారు. అలాగే ఇప్పుడు హాయ్ నాన్న ని కూడా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను. సీ యు సూన్’’ అని నాని యుఎస్ లో అందరినీ కోరారు.

సీతారామం లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మ్రిణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రమిది. పాటలు అందరినీ ఆకట్టుకుని హై నాన్న చిత్రానికి తిరుగులేని డిమాండ్, క్రేజ్ ని తెచ్చాయి. ఈ డిఫరెంట్ సినిమా నానికి బాక్సాఫీసు విజయంతో పాటు నటుడిగా ఎనలేని పేరు తెస్తుంది అందరూ అశిస్తున్నారు. ప్రస్తుతం నానీ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరీ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

– నాగేంద్ర కుమార్

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet