iDreamPost
android-app
ios-app

బర్త్ డే వేడుక.. అందంగా అలంకరించిన బెలూనే ఈ చిన్నారి ప్రాణం తీసింది!

  • Published Oct 11, 2023 | 11:44 AM Updated Updated Oct 11, 2023 | 11:44 AM
  • Published Oct 11, 2023 | 11:44 AMUpdated Oct 11, 2023 | 11:44 AM
బర్త్ డే వేడుక.. అందంగా అలంకరించిన బెలూనే ఈ చిన్నారి ప్రాణం తీసింది!

ఈ ఫొటోలో నవ్వుతూ కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు అలెగ్జాండ్రా కెల్లీ. ఇటీవల ఈ పాప పుట్టిన రోజు కావడంతో ఆమె తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేశారు. దగ్గరలో ఉన్న బంధువులందరినీ పిలిచారు. బెలూన్ లతో ఇళ్లంతా ఎంతో అందంగా ముస్తాబు చేశారు. అందరూ కలిసి ఆ చిన్నారి బర్త్ డే వేడుకలు జరిపారు. కట్ చేస్తే.. అందంగా ముస్తాబు చేసిన ఆ బెలూన్ లే చివరికి ఆ చిన్నారి ప్రాణం తీశాయి. అసలు ఈ చిన్నారి ఎలా చనిపోయిందంటే?

మీడియా కథనం ప్రకారం.. అమెరికాలోని టెన్నెసీలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 7 ఏళ్ల అలెగ్జాండ్రా కెల్లీ అనే కూతురు ఉంది. సెప్టెంబర్ 24న ఈ బాలిక పుట్టిన రోజు కావడంతో ఆమె తల్లిదండ్రులు సెలబ్రెట్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే దగ్గరిలోని బంధువులను అందరినీ పిలిచారు. ఇక ఇళ్లంతా బెలూన్ లతో అందంగా మస్తాబు చేశారు. అనుకున్నట్లుగానే అలెగ్జాండ్రా కెల్లీ బర్త్ డే వేడుకలను ఘనంగా జరిపారు. ఆ తర్వాత బంధువులందరూ ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 1వ తేదీన అలెగ్జాండ్రా కెల్లీ బర్త్ వేడుకలకు తెచ్చిన ఓ బెలూన్ తీసుకుని గదిలోకి వెళ్లి ఆడుకుంది.

అయితే ఎంతసేపైన కూతురు గదిలో నుంచి బయటకు రాకపోవడంతో వెంటనే ఆమె తల్లిదండ్రులు గదిలోకి వెళ్లి చూశారు. కానీ అప్పటికే అలెగ్జాండ్రా కెల్లీ కిందపడిపోయి కనిపించింది. తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ చిన్నారి చనిపోయిందని నిర్ధారించారు. డాక్టర్లు అందుకు గల కారణాన్ని కూడా వివరించారు. బెలూన్ లో ఉన్న ప్రమాదకరమైన హీలియం గాలిని పీల్చడం వల్లే ఆ బాలిక చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio