iDreamPost
android-app
ios-app

ఇద్దరు పిల్లల్ని కాల్చి చంపిన తల్లి.. కారణం తెలిసి ఖంగుతిన్న పోలీసులు!

అమెరికాలో దారుణం చోటు చేసకుంది. ఓ మహిళ తన ఇద్దరు కుమారులను తుపాకీతో కాల్చి చంపింది. ఆ మహిళ ఎందుకు ఇలా చేసిందో తెలిస్తే షాక్ గురవుతారు.

అమెరికాలో దారుణం చోటు చేసకుంది. ఓ మహిళ తన ఇద్దరు కుమారులను తుపాకీతో కాల్చి చంపింది. ఆ మహిళ ఎందుకు ఇలా చేసిందో తెలిస్తే షాక్ గురవుతారు.

ఇద్దరు పిల్లల్ని కాల్చి చంపిన తల్లి.. కారణం తెలిసి ఖంగుతిన్న పోలీసులు!

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు కుమారులను అతి దారుణంగా తుపాకీతో కాల్చింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు హుటాహుటిన ఆ పిల్లలను ఆస్పత్రికి తరలించారు. ఇక ఫలితం లేకపోవడంతో ఆ ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితురాలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ, హత్యకు గల కారణం తెలిసి పోలీసులే షాకయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ మహిళ తన ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చడానికి కారణం ఏంటి? ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

న్యూస్ వీక్ కథనం ప్రకారం.. అమెరికా కెంటకీలో టిఫానీ యాన్ కేథరిన్ (32) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు మారిస్ బేకర్ జూనియర్ (6), జేడన్ హోవార్డ్ (9) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తన పిల్లలను చూసుకుంటూ ఈ మహిళ సంతోషంగా ఉండేది. ఇదిలా ఉంటే.. నవంబర్ 8న కేథరిన్ ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. తుపాకీతో 30 సెకన్లలో నాలుగు షాట్లతో తన ఇద్దరు కుమారులను కాల్చింది. దీంతో ఆ ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడిపోయారు. వెంటనే గమనించిన కొందరు స్థానికులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ, పరిస్థితి విషమించడంతో ఆ ఇద్దరు బాలురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ చేపట్టగా సొంత తల్లే పిల్లలను తుపాకీతో కాల్చి చంపిందని తెలుసుకున్నారు.

ఎందుకు నీ పిల్లలను తుపాకీలో కాల్చి చంపావని అడగగా… నన్ను గత కొంత కాలంగా ఫేక్ బుక్ ద్వారా కొందరు మానిప్యులేట్ చేశారని, అందుకే నా పిల్లలను ప్రమాదవశాత్తు హత్య చేయాల్సి వచ్చిందని తెలిపి తన నేరాన్ని అంగీకరించింది. వెంటనే పోలీసులు ఆ నిందితురాలిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తులు విచారణ అనంతరం మాట్లాడుతూ.. ఇలాంటి వ్యక్తులు సమాజానికే ప్రమాదకరమని తెలిపారు. అయితే ఈ ఘటనపై మారిస్ బేకర్ జూనియర్ సవతి తల్లి స్పందించింది. కేథరిన్ ఈ ఘోరం ప్రమాదవశాత్తు చేయలేదని, కావాలనే ఇలా పిల్లలను హత్య చేసిందని ఆరోపించారు. దీంతో పాటు ఆమెను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ను కూడా లేవనెత్తారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఫేస్ బుక్ ద్వారా మానిప్యులేట్ చేశారని తన ఇద్దరు కుమారులను చంపిన తల్లి కేథరిన్ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi giriş