iDreamPost

USA ప్రకటన.. వీసాల జారీలో భారత విద్యార్థులకే అధిక ప్రాధాన్యత!

USA ప్రకటన.. వీసాల జారీలో భారత విద్యార్థులకే అధిక ప్రాధాన్యత!

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని చాలా మంది కోరుకుంటారు. కొంతమందికి అది తమ చిరకాల కోరిక కూడా అయి ఉంటుంది. విదేశీ విద్య అనగానే ముందు గుర్తొచ్చే దేశం అమెరికా. విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది అమెరికాలో తమ ఉన్నత విద్యను పూర్తి చేయాలి అనుకుంటారు. అయితే అది అంత తేలికైన విషయం కాదు. అందుకు చాలా పోటీ ఉంటుంది. అయితే అమెరికా ఎంబసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్టూడెంట్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. వీసాల విషయంలో భారత విద్యార్థులకే తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామంటూ యూఎస్ ఎంబసీ వ్యాఖ్యానించింది.

అమెరికాలో హయ్యర్ స్టడీస్ చేయాలని ఎంతో మంది అనుకుంటారు. కానీ, అమెరికా నుంచి స్టూడెంట్ వీసా రావడం అంత తేలిక కాదు. అందుకు గట్టి పోటీ ఉంటుంది. కానీ, ఇండియాలో ఉన్న అమెరికా ఎంబసీ వాళ్లు చేసిన వ్యాఖ్యలు భారత విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతున్నాయి. స్టూడెంట్ వీసాలకు సంబంధించి భారతదేశ విద్యార్థులకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇండియాలో ఉన్న అమెరికా ఎంబసీ వ్యాఖ్యానించింది. అందుకు సంబంధించిన లెక్కలను కూడా వెల్లడించారు. 2022కు సంబంధించి భారతీయ విద్యార్థులకు మొత్తం 1.25 లక్షల వీసాలను జారీ చేశారు. ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు సెమిస్టర్ కు సంబంధించి ఇప్పటివరకు 90,000 మందికి వీసాలు జారీ చేసినట్లు ప్రకటించారు. రెండో విడతతో కలిపి ఈ ఏడాది రికార్డు స్థాయిలో వీసాల జారీ ఉంటుందని స్పష్టమైంది.

వీసాల విషయంలో భారత్ లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయం ఏం చెప్పిందంటే.. “జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించి భారత్ లో యూఎస్ మిషన్ కింద.. మొత్తం 90 వేల మంది విద్యార్థులకు వీసాలు జారీ చేశాం. ఈ వేసవిలో జారీ చేసిన నాలుగు స్టూడెంట్ వీసాల్లో ఒకటి భారత్ లోనే ఉంది. ఉన్నత విద్య కలను సాకారం చేసుకునేందుకు అమెరికాను ఎంచుకున్న భారతీయ విద్యార్థులకు శుభాకాంక్షలు. ఈ సెమిస్టర్ కు సంబంధించి అర్హులైన విద్యార్థులు అందరూ తమ తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకున్నాం” అంటూ భారతదేశంలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయం ప్రకటించింది. అయితే ఈ ప్రకటనతో భారత విద్యార్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి.

2022 సంవత్సరంలో భారత విద్యార్థులకు జారీ చేసిన 1.25 లక్షల వీసాలు.. ప్రంపంచంలోనే అత్యధికం. ఈ ఏడాది దాదాపు 2 లక్షల మంది వరకు భారత విద్యార్థులు అమెరికా విద్యాసంస్థల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 90 వేల మందికి వీసాలు జారీ చేశారు. రెండో విడతలో మిగిలిన వారికి కూడా వీసాలు జారీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ లెక్కలు చూస్తే అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత విద్యార్థులు 20 శాతానికి చేరుకోనున్నారు. భారత విద్యార్థులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం అంటున్న అమెరికా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి