ఒకప్పుడు మాస్ లో మంచి మార్కెట్ సంపాదించుకున్న విశాల్ కు గత కొన్నేళ్లుగా కనీస హిట్ లేకుండా పోయింది. 2018లో అభిమన్యుడు రూపంలో హిట్ దక్కినప్పుడు తిరిగి ఫామ్ లోకి వచ్చాడని ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. పందెం కోడి 2 బిసి సెంటర్స్ లో పర్వాలేదనిపిస్తే ఓవరాల్ గా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. టెంపర్ రీమేక్ ని అయోగ్య పేరుతో తిరిగి డబ్బింగ్ చేస్తే కనీసం ఎవరూ పట్టించుకోనూ లేదు. […]