iDreamPost
android-app
ios-app

Vishal: ఆడబిడ్డలకి ఆ కష్టం తీర్చడం కోసం అప్పులు చేస్తూ.. విశాల్ మంచి మనసుకి హ్యాట్సాఫ్!

రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా హీరో అని నిరూపించుకుంటున్నాడు నటుడు విశాల్. పందెంకోడితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశాల్.. ఇప్పుడు రత్నం అనే చిత్రంతో రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన..

రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా హీరో అని నిరూపించుకుంటున్నాడు నటుడు విశాల్. పందెంకోడితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశాల్.. ఇప్పుడు రత్నం అనే చిత్రంతో రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన..

Vishal: ఆడబిడ్డలకి ఆ కష్టం తీర్చడం కోసం అప్పులు చేస్తూ.. విశాల్ మంచి మనసుకి హ్యాట్సాఫ్!

తమిళంలో వాహ సాగిస్తున్న తెలుగబ్బాయి విశాల్ కృష్ణా రెడ్డి అలియాస్ విశాల్. పందెంకోడితో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హిట్ అందుకున్నాడు. తన సినిమాలను తెలుగులో డబ్ చేసి.. ఇక్కడ మార్కెట్ కూడా పెంచుకున్నాడు. ప్రేమ చదరంగం, పిస్తా, వాడు వీడు, సెల్యూట్, భరణి, డిటెక్టివ్, అభిమన్యుడు, కథకళి, పూజ, యాక్షన్, ఇంద్రుడు, ఎనిమీ, మార్క్ ఆంథోనీ వంటి సినిమాలతో అలరించాడు. ఇప్పుడు రత్నం అనే మూవీ చేస్తున్నాడు. తనకు భరణి, పూజతో హిట్స్ ఇచ్చిన యాక్షన్ అండ్ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో రత్నం మూవీ రూపుదిద్దుకుంటుంది. ఏప్రిల్ 26న విడుదల కానుంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియో పతాకాలపై కార్తీకేయన్ సంతానం, అలంకార్ పాండ్యన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియ భవాని శంకర్, సముద్ర ఖని, గౌతమ్ వాసు దేవ మీనన్, యోగి బాబు, మురళీ శర్మ తదితరులు కీలక పాతల్రు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ సినిమాలపై అంచనాలు పెంచేస్తుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌లో ఏం జరుగుతుంది అంటూ రెండు రాష్ట్రాలపై ఫోకస్ చేశాడు విశాల్. ఓ అమ్మాయి కోసం చేస్తోన్న పోరాటంగా కనిపిస్తుంది. ఇక ఏప్రిల్ చివరి వారంలో మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విశాల్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. విశాల్ రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా హీరో అన్న సంగతి విదితమే.

ఇప్పటికే ఎంతో మంది పేద విద్యార్థులను అతడు చదివిస్తున్న సంగతి విదితమే. అలాగే మొన్నటి మొన్న ఈ సినిమా షూటింగ్ సమయంలో తూత్తుకుడి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పలు సన్నివేశాలు తెరకెక్కిస్తున్నప్పుడు.. అక్కడ సరైన నీటి సదుపాయం లేదని తెలిసి.. అప్పటికప్పుడు బోరు బావి తవ్వించాడు. అంతక ముందు పునీత్ రాజ్ కుమార్ తన ట్రస్ట్ ద్వారా కొంత మంది పిల్లలు చదివిస్తుండగా.. అతడి మరణించి తర్వాత ఆ పిల్లల్నిచదివించే బాధ్యత తీసుకున్నాడు విశాల్. తాజాగా మరో సారి మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నాడు. ఎక్కడైనా పేద విద్యార్థులు ఉంటే.. తాను చదివిస్తానంటూ ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ మాట్లాడుతూ..

‘అండర్ ప్రివిలేజ్ చిల్ర్టన్‌ను ఎక్కడ ఉన్నా చదివిస్తాం. చదువుకోవాలన్న పట్టుదల, మధ్యలో చదువులు ఆపేసినా, మళ్లీ చదువుకోవాలని తపన ఉన్నా, ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశ ఉండి.. తల్లిదండ్రుల దగ్గర ఆర్థిక స్థోమత లేదు అని ఆలోచిస్తున్న అమ్మాయిలు, నేను డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలనుకుంటున్న వారు.. విశాల్ అన్నయ్య ఉన్నాడు మమ్మల్ని చదివించడానికి అని ధైర్యంగా చెప్పి చెన్నైకి రండి. నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే.. అప్పులు చేసైనా సరే చదివిస్తా’ అని పేర్కొన్నాడు. ఆయన్ను గ్రేట్ హీరో అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.  విశాల్ మంచి మనస్సుకు హ్యేట్సాఫ్ చెబుతున్నారు.