iDreamPost
android-app
ios-app

వాళ్ల బెదిరింపుల వలన నిర్మాతగా మారాను: విశాల్

  • Author ajaykrishna Updated - 03:45 PM, Fri - 8 September 23
  • Author ajaykrishna Updated - 03:45 PM, Fri - 8 September 23
వాళ్ల బెదిరింపుల వలన నిర్మాతగా మారాను: విశాల్

హీరోలైనా, హీరోయిన్స్ అయినా కెరీర్ లో ఎదుగుతున్న క్రమంలో ఇబ్బందులు అనేవి తప్పవు. ఏ ఇబ్బంది లేకుండా సాఫిగా కెరీర్ సాగించిన సందర్భాలు చాలా తక్కువ. అయితే.. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశానని.. చాలామంది నిర్మాతలు తనపై బెదిరింపులకు పాల్పడ్డారని షాకింగ్ ఆరోపణలు చేశాడు హీరో విశాల్. పందెం కోడి సినిమాతో హీరోగా మారిన విశాల్.. తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అప్పటినుండి తమిళంలో సినిమాలు చేసినా.. తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు విశాల్.

యాక్షన్ సినిమాలకు విశాల్ పెట్టింది పేరు. ప్రస్తుతం మార్క్ ఆంటోనీ సినిమాని రిలీజ్ కి రెడీ చేశాడు. సెప్టెంబర్ 15న వరల్డ్ వైడ్ తమిళ, తెలుగుతో పాటు ఇతర భాషలలో రిలీజ్ అవుతోంది మార్క్ ఆంటోనీ సినిమా. ఇప్పుడు సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు. ఇప్పటికే మార్క్ ఆంటోనీ ట్రైలర్.. రెండు భాషలలో విపరీతంగా వైరల్ అవుతోంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించాడు. వినోద్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు. కాగా.. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశాల్ తన కెరీర్ స్టార్టింగ్ డేస్ గురించి మాట్లాడుతూ.. తాను సొంత నిర్మాణ సంస్థ పెట్టడానికి గల కారణాలు చెప్పుకొచ్చాడు.

ఈ సందర్బంగా విశాల్ మాట్లాడుతూ.. “సినీ పరిశ్రమలో అందరికి సమస్యలు ఉంటాయి. చాలా కాలం వెయిట్ చేసి పందెం కోడి చేస్తే.. పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమాతో నన్ను యాక్షన్ హీరోగా గుర్తించారు. అప్పటినుండి వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాను. కానీ.. సరిగ్గా రిలీజ్ సమయానికి నిర్మాతలు ఏదొక చిక్కు పెట్టేవారు. సినిమా శుక్రవారం రిలీజ్ అనగా.. గురువారం రోజున నా సినిమా రిలీజ్ కాదని.. ఫైనాన్సియర్స్ కి డబ్బులు ఇవ్వాలని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసేవారు. సరిగ్గా రెమ్యూనరేషన్స్ కు ఇచ్చేవారు కాదు. అప్పుడే నాకు ప్లాప్స్ వచ్చి.. నానా ఇబ్బందులు చూశాను. ఇవన్నీ కాదని.. సొంతంగా ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను. అప్పటినుండి మంచి కథలతో సినిమాలు చేస్తూ.. నిలబడ్డాను.” అని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం విశాల్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి విశాల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి