iDreamPost
android-app
ios-app

మార్క్ ఆంటోనీలో సిల్క్ స్మిత! ఆ పాత్రలో మెరిసిన బ్యూటీ ఎవరో తెలుసా?

  • Author ajaykrishna Published - 04:37 PM, Tue - 12 September 23
  • Author ajaykrishna Published - 04:37 PM, Tue - 12 September 23
మార్క్ ఆంటోనీలో సిల్క్ స్మిత! ఆ పాత్రలో మెరిసిన బ్యూటీ ఎవరో తెలుసా?

ఇండస్ట్రీలో నటులను పోలిన నటులు అప్పుడప్పుడు తారసపడుతుంటారు. నటులను పోలి ఉన్నవారంతా సినీ ఇండస్ట్రీకి చెందినవారు అయ్యుండాలని లేదు. ఎందుకంటే.. పోలికలు అనేవి కామన్. తాజాగా ఇండస్ట్రీలో జూనియర్ సిల్క్ స్మిత పేరుతో ఓ బ్యూటీ ట్రెండ్ అవుతోంది. అదేంటి జూనియర్ సిల్క్ స్మితనా అని ఆశ్చర్యపోవచ్చు. కానీ.. ఆమె పోలికలు పూర్తిగా అలనాటి సిల్క్ స్మితను పోలి ఉండటం విశేషం. పైగా ఆ బ్యూటీని ఏకంగా బిగ్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేస్తున్నారు. హీరో విశాల్ నటించిన కొత్త సినిమా ‘మార్క్ ఆంటోనీ’. ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కి రెడీ అవుతోంది.

కాగా.. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో సిల్క్ స్మిత ప్రస్తావన కూడా రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో విశాల్ డ్యూయెల్ రోల్ లో నటించినట్లు తెలుస్తోంది. ఎస్.జే. సూర్య కూడా ఇందులో ప్రధాన పాత్రలో నటించాడు. అయితే.. ఈ సినిమా ట్రైలర్ లో సిల్క్ స్మిత స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అందరూ.. ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేశారని అనుకున్నారు. కానీ.. సినిమాలో సిల్క్ పాత్రలో.. సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న ఓ అమ్మాయి నటించింది.

ప్రస్తుతం సిల్క్ స్మిత పాత్రలో మెరిసిన అమ్మాయి ఎవరు? ఆమె డీటెయిల్స్ ఏంటని ఆరా తీస్తున్నారు నెటిజన్స్. మరి ఆ అమ్మాయి ఎవరనే వివరాల్లోకి వెళ్తే.. సినిమాలో సిల్క్ స్మితగా నటించిన బ్యూటీ అసలు పేరు విష్ణుప్రియా గాంధీ. అచ్చం ట్రైలర్ సిల్క్ ని పోలి ఉండటంతో.. ఆమెను చూసి అందరు అట్రాక్ట్ అవుతున్నారు. ఈమె ఎవరు అచ్చం సిల్క్ లాగే ఉంది.. జూనియర్ సిల్క్ స్మితనా అంటూ కితాబు ఇచ్చేస్తున్నారు. కాగా.. సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫేమస్ అయిన విష్ణుప్రియ.. తనకు మార్క్ ఆంటోనీ మూవీలో అవకాశం ఇచ్చినందుకు మేకర్స్ కి థాంక్స్ చెప్పింది. మరి జూనియర్ సిల్క్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Venu Chaithu (@venuchaithu28)

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş