iDreamPost
android-app
ios-app

విజయ్ ఆంటోనీ కుమార్తెను తలచుకుని వేదికపైనే ఏడ్చేసిన విశాల్..

  • Published Sep 23, 2023 | 12:43 PM Updated Updated Sep 23, 2023 | 12:43 PM
  • Published Sep 23, 2023 | 12:43 PMUpdated Sep 23, 2023 | 12:43 PM
విజయ్ ఆంటోనీ కుమార్తెను తలచుకుని వేదికపైనే ఏడ్చేసిన విశాల్..

కోలీవుడ్ నటుడు విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. పేరుకు కోలీవుడ్ నటుడు అయినప్పటికీ.. తన మాతృభాష తెలుగులోనూ తన సినిమాలను డబ్బింగ్ చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. నిర్మాత కొడుకుగా పరిశ్రమలోకి వచ్చినప్పటికీ.. తనను తాను ఫ్రూవ్ చేసుకున్నారు. ఫెయిల్యూర్ ఎదురైనా అలుపెరుగని విక్రమార్కుడిలా మూవీస్ చేస్తూనే ఉన్నారు. విశాల్ ముక్కు సూటి మనిషి అన్న సంగతి తెలిసిందే. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆయన నైజం. అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఉంటారు. తోటి నటీనటుల పట్ల ఆప్యాయతగా మెలుగుతారు. విశాల్ తాజాగా మార్క్ ఆంటోనీతో ముందకు వచ్చాడు. మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నా.. విశాల్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమాను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు.

చెన్నైలో నిర్వహించిన సక్సెస్ మీట్ లో పాల్గొంది మార్క్ ఆంటోనీ చిత్ర బృందం. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. మీడియా ముందు మాట్లాడుతూ..‘ నామిత్రుడు, నా క్లాస్ మేట్, సహనటుడు, విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా చనిపోయారు’ ఈ సందర్భంగా ఒక నిమిషం మౌనం పాటించాలని కోరారు. అనంతరం వేదికపైనే ఏడ్చేశారు. మీరా ఆత్మకి శాంతి చేకూరాలని విశాల్ అన్నారు. విజయ్ కి జరిగిన ఈ నష్టం తనకు జరిగినట్లు అనిపిస్తోంది అని విశాల్ అన్నారు. విజయ్ ఆంటోనీ ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కంటతడి పెట్టుకున్నారు. అంతలో భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకుని వేదికపై తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ నటుడు, విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. ఈ మంగళవారం తెల్లవారు జామున వారి ఇంట్లో ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet