iDreamPost
android-app
ios-app

ఓటిటిలోకి విశాల్ రూ. 100 కోట్ల సినిమా.. నెల ముందే స్ట్రీమింగ్ కి రెడీ!

  • Author ajaykrishna Published - 01:08 PM, Mon - 9 October 23
  • Author ajaykrishna Published - 01:08 PM, Mon - 9 October 23
ఓటిటిలోకి విశాల్ రూ. 100 కోట్ల సినిమా.. నెల ముందే స్ట్రీమింగ్ కి రెడీ!

ఇప్పుడున్న కోలీవుడ్ స్టార్స్ లో యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు విశాల్. ఒక నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా రాణిస్తున్నాడు. తనకు బాగా కలిసి వచ్చిన యాక్షన్ జానర్ సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న విశాల్.. తన ప్రతీ సినిమాని తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి రిలీజ్ చేస్తుంటాడు. విశాల్ కి తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇటీవల విశాల్ హీరోగా నటించిన ‘మార్క్ ఆంటోనీ’ మూవీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ నమోదు చేసింది. అభిమన్యుడు తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టలేదు విశాల్. చేస్తున్న ప్రతీ సినిమాకు టాక్ వస్తుంది గానీ కలెక్షన్స్ ఉండట్లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అలాంటి నెగిటివ్ కామెంట్స్ అన్నింటికీ తాజాగా మార్క్ ఆంటోనీ మూవీతో సమాధానం చెప్పేశాడు. క్రైమ్ కామెడీ డ్రామా జానర్ తెరకెక్కిన ఈ సినిమాలో విశాల్, SJ సూర్య ప్రధాన పాత్రలలో నటించారు. హీరోయిన్ గా తెలుగు బ్యూటీ రీతూ వర్మ నటించింది. ఈ సినిమాని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ రూపొందించారు. కాగా.. బాక్సాఫీస్ వద్ద మంచి అంచనాలతో విడుదలైన మార్క్ ఆంటోని మూవీ.. పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఒకరకంగా విశాల్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూల్ చేసి రికార్డు సృష్టించింది. విశాల్ కెరీర్ లో ఇప్పటిదాకా రూ. 100 కోట్లు క్రాస్ చేసిన సినిమాలు లేవు.

కట్ చేస్తే.. ఇప్పుడు మార్క్ ఆంటోనీతో వంద కోట్ల బోణి జరిగిపోయింది. గత నెల వినాయక చవితి సందర్బంగా విడుదలైన ఈ సినిమా.. పోటీగా పెద్ద సినిమాలేవి లేకపోవడంతో పాజిటివ్ టాక్ తో వసూళ్లు బాగా చేసింది. టైటిల్ కి తగ్గట్టుగా మార్క్, ఆంటోనీ రెండు పాత్రలలో విశాల్ నటించగా.. విలన్ క్యారెక్టర్ లో sj సూర్య ఆదరగొట్టేసాడు. సినిమా అంతా ఫుల్ ఫన్ తో టైమ్ ట్రావెలింగ్ సబ్జెక్టుతో ఆసక్తికరంగా సాగింది. మొత్తానికి థియేటర్స్ లో రూ. 100 కోట్లకు పైగా రాబట్టిన మార్క్ ఆంటోనీ.. డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. విడుదలైన నాలుగు వారాలకే అంటే.. అక్టోబర్ 13 నుండి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. కాగా.. ఈ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. మరి మార్క్ ఆంటోనీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet