iDreamPost
android-app
ios-app

విశాల్ భరణి సినిమాలోని హీరోయిన్.. ఇప్పుడు ఇంతలా మారిపోయింది ఏంటి?

  • Published Apr 22, 2024 | 2:36 PM Updated Updated Apr 22, 2024 | 2:36 PM

విశాల్, యాక్షన్ అండ్ మాస్ డైరెక్టర్ హరి కాంబోలో తెరకెక్కిన తొలి సినిమా భరణి. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రత్నం అనే మూవీ రాబోతుంది. అయితే భరణి మూవీలో నటించిన హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

విశాల్, యాక్షన్ అండ్ మాస్ డైరెక్టర్ హరి కాంబోలో తెరకెక్కిన తొలి సినిమా భరణి. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రత్నం అనే మూవీ రాబోతుంది. అయితే భరణి మూవీలో నటించిన హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

  • Published Apr 22, 2024 | 2:36 PMUpdated Apr 22, 2024 | 2:36 PM
విశాల్ భరణి సినిమాలోని హీరోయిన్.. ఇప్పుడు ఇంతలా మారిపోయింది ఏంటి?

టాలీవుడ్ హీరోలతో పోటీ పడుతూ మార్కెట్ పెంచుకుంటున్నారు కొంత మంది తమిళ నటులు. వారిలో ఒకరు విశాల్. కోలీవుడ్ నాటే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా తన సినిమాలతో సత్తా చాటుతున్నాడు. తెలుగు కుర్రాడు అయినప్పటికీ.. తండ్రి అక్కడ సెటిల్ కావడంతో తమిళంలో సినిమాలు చేస్తూ.. వాటిని తెలుగులో డబ్ చేస్తూ ఇక్కడి ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇంచుమించు అతడు నటించిన అన్నీ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. తాజాగా రత్నం మూవీతో రాబోతున్నాడు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పందెం కోడి, భరణి, పూజ,  సెల్యూట్, పిస్తా, వాడు- వీడు, డిటెక్టివ్, అభిమన్యుడు, ఎనిమి, మార్క్ ఆంటోనీ సినిమాలను బాగా ఆదరించారు తెలుగు ప్రేక్షకులు.

ఇప్పటికే తనకు రెండు హిట్స్ ఇచ్చిన హరితో మూడవ చిత్రంతో రాబోతున్నాడు విశాల్. రత్నం ఏప్రిల్ 26న విడుదల కానుంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన తొలి సినిమా భరణి. తమిళంలో తామిర భరణి పేరు కాగా, తెలుగులో భరణి పేరుతో రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్‌గా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే.. ఆమె పిల్ల తల్లి అంటే నమ్మలేరు. తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా మాత్రమే చేసింది ఈ బ్యూటీ. తమిళం, మలయాళ ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఈ నటి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హవా కొనసాగిస్తుంది. ఆమె కూడా మలయాళ కుట్టీనే. మాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వచ్చి.. కోలీవుడ్ ఇండస్ట్రీలో తన యాక్టింగ్, గ్లామర్ పాత్రల్లో మెప్పించింది. ఆమె నటి మాత్రమే కాదు.. డ్యాన్సర్, సెలూన్ కూడా నడుపుతోంది.

ఇంతకు ఆ నటి ఎవరంటే.. ముక్త. కానీ భరణిలో ఆమె పేరు భానుమతి కావడంతో భానుగా అందరికీ సుపరిచితం అయ్యింది. ఈ సినిమా పాటలు కూడా చాలా హిట్స్.. ‘నలుపైన కన్నయ్య చేయి పడితే’, ‘తాళింక ఎందుకు లేవే’ సాంగ్స్ ఫేమస్ అయ్యాయి. ఇందులో ఆమె ముక్త చాలా స్పెషల్ డ్రెస్సుల్లో అలరిస్తూ ఉంటుంది. తలలో ఓ సైడ్‌కు పువ్వు పెట్టి సినిమా అంతా అలరించింది ఈ బ్యూటీ. తెలుగులో అంజలి తొలి సినిమా ఫోటోలో కూడా మెరిసింది ఈ కేరళ కుట్టీ. తమిళ్, మలయాళ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయిపోయింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే రింకూ టామీ అనే వ్యక్తిని మనువాడింది. ప్రస్తుతం ఆమెకు ఓపాప. ప్రస్తుతం మలయాళంలో సినిమాలు, సీరియల్స్ చేస్తుంది. ఇటీవల కురువిపప్ప అనే చిత్రంలో నటించింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పాప కన్మణీతో వీడియోలు చేస్తూ హల్ చల్ చేస్తోంది. యూట్యూబ్‌లో తన వంటలతో అలరిస్తూ ఉంటుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet