iDreamPost
android-app
ios-app

Ayodhya: అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై స్పందించిన స్టార్ హీరోలు వీరే!

  • Published Jan 22, 2024 | 5:57 PM Updated Updated Jan 22, 2024 | 8:52 PM

రామ జన్మభూమి అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎంతో మంది సెలెబ్రిటీలు పాలు పంచుకున్నారు. ఈ క్రమంలో తమ భావాలను వ్యక్తపరుస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్స్ చేస్తున్నారు.

రామ జన్మభూమి అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎంతో మంది సెలెబ్రిటీలు పాలు పంచుకున్నారు. ఈ క్రమంలో తమ భావాలను వ్యక్తపరుస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్స్ చేస్తున్నారు.

  • Published Jan 22, 2024 | 5:57 PMUpdated Jan 22, 2024 | 8:52 PM
Ayodhya: అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై స్పందించిన స్టార్ హీరోలు వీరే!

ఎట్టకేలకు రాముడు తన జన్మ స్థానానికి తిరిగి వచ్చాడు. ఇన్ని వందల సంవత్సరాలు పంతం పట్టి, మారం చేసేడేమో మరి.. అందుకే ఈరోజున అంత్యంత వైభవంగా.. దేశంలోని ప్రముఖులు , ఆత్మీయులు అందరి లాలన మధ్యన..తిరిగి తన స్థానంలో కొలువుతీరాడు ఆ కోదండ బాల రాముడు. ఆ సూర్యవంశపు సౌర్య తేజ కళ తన నిండైన మోములో ఎంతో స్వచ్చంగా కనిపిస్తోంది. చూసేందుకు ఎంతో చూడముచ్చటగా ఉన్న ఆ దృశ్యాలు అందరిని కట్టిపడేశాయి. దేశంలో ఎవరిని తాకిన రామ నామ జపమే కొనసాగిస్తున్నారు. జగమంతా రామ నామ ఘోషతో ప్రణవిల్లుతోంది. ప్రాణ ప్రతిష్టకు ఆ బాల రాముని విగ్రహం నిజంగానే ప్రాణం పోసుకుందా అన్నట్లుగా.. జీవకల ఉట్టిపడుతోంది. ఈ అద్భుతమైన సన్నివేశాలను తిలకించేందుకు విచ్చేసిన సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ భావాలను వ్యక్తపరిచారు.

సాధారణంగా సినీ సెలెబ్రిటీలు ఏ చిన్న పోస్ట్ చేసినా.. అది సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటిది దేశ చరిత్రలోనే జనవరి 22వ తేదీ.. సువర్ణ అక్షరాలతో లికించబడుతుంది. మరి, ఇంతటి అద్భుతమైన రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు.. తమ సంతోషాన్ని అందరికి పంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో సినీ సెలెబ్రెటీలకు.. తమ అభిమానులే ఆప్తులు కాబట్టి .. అందరు వారి వారి సోషల్ మీడియా ఖాతాలలో.. అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం గురించి ఎమోషనల్ గా చెప్తూ ట్వీట్ చేశారు. ఈ జాబితాలో దాదాపు చిత్ర పరిశ్రమకు చెందిన తారలు అంతా.. వారి సంతోషాన్ని పంచుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, విశాల్, మంచు విష్ణు, బ్రహ్మాజీ , జెనీలియా, అజయ్ దేవగన్, సంజయ్ దత్ .. ఇలా ఎంతో మంది సినీ తారలు ఈ మహత్తర ఘట్టం గురించి సంతోషం వ్యక్తం చేశారు. “రామజన్మభూమి యొక్క పవిత్ర మైదానం నుండి గంభీరమైన రామమందిరం వరకు, విశ్వాసం మరియు స్థితిస్థాపకతతో అల్లిన ప్రయాణం” అంటూ సంజయ్ దత్, ఆ మహోత్సవంలో పాల్గొనడం తమ అదృష్టం అని భావిస్తూ.. దీనికి కారకులైన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరికొందరు.. ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ మరికొందరు.. వారి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈరోజున దేశవ్యాప్తంగా జరిగిన ఉత్సవాలు, సందడి వాతావరణాన్ని చూస్తే.. మరో శ్రీరామనవమిని, ఆనాటి పట్టాభిషేక వైభోగాన్ని కలగలిపి చూసినట్టుగా.. ఎంతో చూడముచ్చటగా జరిగింది. ఏదేమైనా.. ఇన్ని సంవత్సరాల సమయం వేచి ఉన్నందుకు.. దాని ఫలితం ఈరోజు అందరి మదిలో ఎప్పటికి చెరగిని తీపి గుర్తులను నింపిందని చెప్పి తీరాలి. కొన్ని కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు ఆ బాల రాముని రూపంలో కొలువుతీరాయి. రానున్న రోజుల్లో అయోధ్య ఒక మహా పుణ్య క్షేత్రంగా మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి, సినీ సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా.. అయోధ్య గురించి పంచుకున్న విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.