iDreamPost
android-app
ios-app

విశాల్ దర్శకత్వంలో విజయ్ సినిమా! ఇదెక్కడి మాస్ మావ!

  • Author ajaykrishna Updated - 04:23 PM, Sat - 16 September 23
  • Author ajaykrishna Updated - 04:23 PM, Sat - 16 September 23
విశాల్ దర్శకత్వంలో విజయ్ సినిమా! ఇదెక్కడి మాస్ మావ!

ఒక్కోసారి ఇండస్ట్రీలో ఊహించని కాంబినేషన్స్ చూస్తుంటాం. తెరపై చూసేంత వరకు రాకపోయినా.. కనీసం ఆ కాంబినేషన్స్ గురించి వింటుంటాం. తెరపైకి వస్తే బాగుంటుందని అనిపించినా.. వచ్చేదాకా గ్యారంటీ ఇవ్వలేం. మామూలుగా ఇప్పటివరకు కలిసి వర్క్ చేయని హీరో, డైరెక్టర్ కాంబో కుదిరితే.. ఈసారి సినిమా డిఫరెంట్ గా ఉండబోతుందని అనుకుంటాం. అదే ఒక హీరో.. ఇంకో హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎక్స్ పెక్ట్ చేయని కాంబినేషన్ కదా.. వినగానే కాస్త సర్ప్రైజింగ్ తో పాటు ఆశ్చర్యంగాను అనిపిస్తుంది. ఎందుకంటే.. ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరోతో సినిమా తీయడం అనేది చాలా రేర్.

ఒక హీరో సినిమాని ఇంకో హీరో నిర్మిస్తున్నాడు అనంటే ఓ సూపర్ అనుకుంటాం. కానీ.. డైరెక్టర్ గా చేస్తాడనగానే ఆశ్చర్యంతో పాటు అనుమానాలు మొదలైపోతాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్స్ విశాల్, దళపతి విజయ్ కాంబినేషన్ గురించి ఫ్యాన్స్ లో అలాంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదేంటి.. ఈ కాంబినేషన్ అసలు అనౌన్స్ చేయలేదు కదా! అనిపించవచ్చు. కానీ.. రీసెంట్ గా మార్క్ ఆంటోనీ ప్రమోషన్స్ లో.. దళపతి విజయ్ తో తన దర్శకత్వంలో ఓ సినిమా తీయడమే డ్రీమ్ అని.. విశాల్ చెప్పినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రెజెంట్ విశాల్ తన కెరీర్ మంచి హిట్ అయిన డిటెక్టివ్ మూవీకి సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మిస్కిన్ తెరకెక్కించిన ఈ సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కి స్వయంగా తానే దర్శకత్వం వహిస్తున్నాడు విశాల్. సో.. ఎలాగో డైరెక్టర్ గా అవతరిస్తాడు కాబట్టి.. విశాల్ దర్శకత్వంలో దళపతి విజయ్ సినిమా ఎక్స్ పెక్ట్ చేయొచ్చని ఇండస్ట్రీ టాక్. కాగా.. “దళపతి విజయ్ తో ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. అన్ని కుదిరితే త్వరలోనే ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. ఇప్పటికే విజయ్ మేనేజర్ కి కాంటాక్ట్ అయి.. కథ చెప్పాలని అపాయింట్మెంట్ అడిగాను. అది విని మేనేజర్ షాక్ అయ్యాడు. నాకు విజయ్ కాలేజీ డేస్ నుండే తెలుసు. అప్పట్లో హీరోగా పనికొస్తాడా అని రాసిన మ్యాగజైన్స్ వారు.. సక్సెస్ అయ్యాక విజయ్ జర్నీ గురించి గొప్పగా రాసుకొచ్చారు. నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. సో.. డిటెక్టివ్ 2 అనుభవం అందుకు పనికి వస్తుందని అనుకుంటున్నా” అని విశాల్ తెలిపినట్లు సమాచారం. మరి విశాల్, విజయ్ కాంబినేషన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetcasibom