iDreamPost
android-app
ios-app

పొలిటికల్ ఎంట్రీపై నటుడు విశాల్ క్లారిటీ!

  • Published Feb 07, 2024 | 11:23 AM Updated Updated Feb 07, 2024 | 2:38 PM

తమిళనాడులో నటుడు విశాల్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ.. కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన విశాల్ రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు.

తమిళనాడులో నటుడు విశాల్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ.. కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన విశాల్ రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు.

  • Published Feb 07, 2024 | 11:23 AMUpdated Feb 07, 2024 | 2:38 PM
పొలిటికల్ ఎంట్రీపై నటుడు విశాల్ క్లారిటీ!

సినిమా గ్లామర్ తో రాజకీయాల్లోకి ప్రవేశించిన యాక్టర్స్ చాలా మందే ఉన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఇలా ప్రతీ ఇండస్ట్రీలో పలువురు నటులు ఇప్పటికే రాజకీయరంగ ప్రవేశం చేసి రాజకీయాల్లో తమదైన మద్ర వేస్తున్నారు. ఇటీవల స్టార్ హీరో దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన తమిళ వెట్రి కళగం పేరిట రాజకీయ పార్టీని ప్రకటించారు. ఇప్పుడు విజయ్ బాటలోనే నటుడు విశాల్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో హీరో విశాల్ కీలక ప్రకటన చేశారు.

vishal new political party

కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు వస్తున్న వార్తలపై నటుడు విశాల్ స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు. తాను రాజ‌కీయ ల‌బ్ధి కోసం పాకులాడే వ్య‌క్తిని కాద‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే అంకిత‌భావం త‌న‌కుంద‌ని అన్నారు. భ‌విష్య‌త్‌లో ప‌రిస్ధితులు మారితే ప్ర‌జ‌ల‌కు మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వహించేందుకు తాను సిద్ధ‌మ‌ని చెప్పారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ విడుదల చేశారు. దీంతో విశాల్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టినట్లైంది.

 

View this post on Instagram

 

A post shared by Vishal (@actorvishalofficial)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet