టిడిపి ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు ఈ నెల 27, 28 తేదీల్లో జూమ్ ద్వారా జరిగింది. టిడిపి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మహానాడుకు కొంత మంది నేతలు డుమ్మా కొట్టారు. కొంత మంది హాజరైనా బహిరంగంగానే తమ అసంతృప్తిని వెల్లగక్కారు. ఈ మహానాడు కేవలం అధికార వైసిపిని తిట్టడానికి, చంద్రబాబును పొగుడుకోవడానికి పెట్టినట్టు జరిగింది. టిడిపిలో నేతలెవ్వరూ కృషి లేనట్లు..ఒక్క చంద్రబాబు కృషి మాత్రమే ఉన్నట్లు ఆయనను సంతృప్తి పరిచేందుకే ఆయన భజన బృందం మొగ్గు […]
బాలకృష్ణ గురించి టీడీపీ నాయకులు ఎవరైనా మాట్లాడాల్సిన సందర్భం వస్తే చాలా ఆచితూచి మాట్లాడతారు . మా బాలయ్యది పసిపిల్లోడి మనస్తత్వం అండీ , మనసులో ఏదీ ఉంచుకోడు .బోలా శంకరుడి లాంటి వాడు లాంటి పదజాలం వాడుతూ ఇబ్బందికరంగా చూస్తూ రెండు ముక్కల్లో ముగించే ప్రయత్నం చేస్తారు . ఎవరి పట్ల అయినా దురుసుగా ప్రవర్తించిన విషయం కానీ చెయ్యి చేసుకొన్న ఘటనలు కానీ ప్రస్తావనకు వస్తే అబ్బే ఆయన కోపం తాటాకు మంట లాంటిది […]
మూడు సార్లు.. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి.. తన హయాంలో ప్రజల కోసం ఫలానా పథకం ప్రవేశపెట్టాను, ఫలానా విధంగా మేలు చేశాను అని చెప్పుకునేందుకు ఒక్క పని లేదంటే అతిశయోక్తిగా ఉంది. అయినా ఇది నిజమే. ఎందుకంటే తన హాయంలో ప్రజల కోసం ప్రవేశపెట్టానని ఒక్క పథకం కూడా చెప్పని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెట్టిన పథకాలను ఈ రోజు జరిగిన జూమ్ మహానాడులో ఏకరవు […]
మహానాడు అంటే ఓ పండుగ. టీడీపీ శ్రేణులకు పెద్ద పండుగ. కదిలి రండి తెలుగుదేశ కార్యకర్తలరా అనగానే ఉప్పొంగే ఉత్సాహం.. ఉరకలెత్తే ఆనందం. ఇదంతా ఒకనాటి వైభోగం. వర్తమానం నిండా నిర్వేదం.. నిరాశ.. నమ్మకం కోల్పోయిన నాయకత్వం తో నానాటికీ తీసికట్టు గా మారుతున్న నైరాశ్యం. తెలుగుదేశం చరిత్రలోనే అత్యంత గడ్డు స్థితిలో ప్రస్తుతం మహానాడు మొదలవుతుంది. అదే సమయంలో చంద్రబాబు వ్యక్తిగతంగాను, నాయకుడిగాను, పార్టీ పరంగానూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్న దశలో మహానాడు జరుగుతోంది. దాంతో […]
మాములుగా ఏ దేశాధినేతనో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రినో కామెంట్ చేయాలంటే చాలా బాధ్యతగా వ్యవహరించాలి. నిజమేదో అబద్దమేదో తెలుసుకుని ముందడుగు వేయాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోరణే. వేదిక ఏదైనా పెద్దల గురించి చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అలాంటిది ఏకంగా సినిమానే తీస్తే. ఊహించగలమా. కానీ ఓసారి జరిగింది. 1989లో సీనియర్ నటులు టి. ప్రభాకర్ రెడ్డి గారి దర్శకత్వంలో ‘గండిపేట రహస్యం’ అనే సినిమా వచ్చింది. ఇందులో అప్పటి సిఎం కం స్టార్ […]
నందమూరి కుటుంబం నుంచి స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుని నటనలో రాణిస్తూ అభిమానుల ప్రేమాభిమానాలు సంపాదించుకున్న హీరో బాలకృష్ణ ఒక్కరే. అడపాదడపా హరికృష్ణ కనిపించినా స్టార్ స్టేటస్ ని దక్కించుకోలేకపోయారు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిని మించి ఎదుగుతున్న వారిలో మూడో తరం ఆశాకిరణంగా నిలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. ఫ్యాన్స్ ముద్దుగా తారక్ అని పిలుచుకునే ఈ యంగ్ టైగర్ పడి లేచే కెరటం లాంటి వాడు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా క్లిష్టమైన […]
మాములుగా ఏదైనా హీరోది కొత్త సినిమా ఓపెనింగ్ అంటే ఒకటే చూస్తాం. లేదూ ఏదైనా ప్రత్యేకత ఉంది అంటే ఒకే రోజు రెండు మొదలుపెట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. అలా కాకుండా ఏకంగా 9 సినిమాలు ఒకే రోజు మొదలుపెట్టుకున్న హీరో ఉన్నారంటే కొందరు నమ్మకపోవచ్చేమో. కానీ 2002 సంవత్సరం మార్చ్ 24న ఇది జరిగింది. స్వర్గీయ ఎన్టీఆర్ వారసుల్లో ఒకరైన మోహనకృష్ణ తనయుడు తారకరత్నను లాంచ్ చేస్తూ ఏకంగా తొమ్మిది ప్రాజెక్టులకు ముహూర్తపు షాట్ కొట్టడం […]
రెండు నెలలుగా సినిమా థియేటర్లు లేవు. కరోనా ఇప్పుడే వెళ్లదు. ఒకవేళ వెళ్లినా మళ్లీ జనం వస్తారో లేదో తెలియదు. అంటే ఊళ్లలోని అనేక థియేటర్లు మూతపడుతాయి. అవి కల్యాణ మంటపాలుగానో, లేదా సరుకుల గోడౌన్లగానో మారిపోతాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లు, అపార్ట్మెంట్లగా రూపం మార్చుకుంటాయి. జనం , సందడి , కలలు , ఎమోషన్స్ అన్నీ మాయమై కేవలం మనుషులు తిరిగే ఒకచోటుగా మిగిలిపోతాయి. థియేటర్ కూలిపోయినా జనం మాత్రం ఆ సెంటర్‌ని థియేటర్ పేరుతోనే పిలుస్తారు. ఒకప్పుడు […]
సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా సెంటిమెంట్ కి పెద్ద స్థాయిలో ప్రాధాన్యత ఉంటుంది. నాయకులు అలాంటి సెంటిమెంట్లను ఆచరించడం చాలాకాలంగా ఉంది. కానీ సెంటిమెంట్లను తోసిపుచ్చి, కొత్త చరిత్ర సృష్టించేలా ఇప్పటికే వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం కనిపిస్తోంది. అనేక అంశాల్లో జగన్ గత చరిత్రను చెరిపేశారు. ఇప్పటి వరకూ ఏ మాజీ సీఎం తనయుడు చేయలేనిది, ఎన్టీఆర్ తర్వాత ఏ ప్రాంతీయ పార్టీ వల్ల కానిది, తొలిసారి ఓటమి తర్వాత నిలదొక్కుకోకవడం అనేది ఇలాంటి అనేక […]