iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ డ్రీమ్ కాంబినేషన్ – Nostalgia

  • Published May 01, 2020 | 1:10 PM Updated Updated May 01, 2020 | 1:10 PM
టాలీవుడ్ డ్రీమ్ కాంబినేషన్ – Nostalgia

ఎప్పుడో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ హయంలో చూసిన మల్టీ స్టారర్స్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఇద్దరు హీరోలు కలిసి నటించిన చిత్రాలు టాలీవుడ్ లో బాగా తగ్గిపోయాయి. కొంత వరకు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబులు కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు కానీ చిరంజీవి తరం నుంచి ఇవి పూర్తిగా ఆగిపోయాయి. రాజమౌళి పుణ్యమాని ఆర్ఆర్ఆర్ రూపంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ చూడబోతున్నాం కానీ లేదంటే ఇది కూడా ఉండేది కాదేమో.

విక్టరీ వెంకటేష్ ఇప్పటి యువ హీరోలతో కలిసి చేశారు కానీ తన సమకాలీకులతో నటించడం సాధ్యపడలేదు. నాగార్జునదీ అదే సమస్య. మంచు విష్ణు లాంటి కుర్రాళ్ళతో కలిసి యాక్ట్ చేశారు. అయితే చిరు, బాలయ్య, వెంకీలతో మాత్రం ఇది సాధ్యపడలేదు. నిన్నటి తరం ఆడియన్స్ ఈ నలుగురిలో ఏ ఇద్దరు కలిసి నటించినా చూసి తరించాలనుకున్నారు కానీ అది కలగానే మిగిలిపోయింది.
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సంగతి సరికాని ఇంకో డ్రీమ్ కాంబినేషన్ వస్తే మాత్రం మూవీ లవర్స్ కి పండగే. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల కలయిక.

డిజాస్టర్లతోనే ఈజీగా 100 కోట్ల మార్కెట్ చేయగలిగే సత్తా ఉన్న ఈ ఇద్దరు కలిసి నటిస్తే అంతకన్నా సెన్సేషన్ ఇంకొకటి ఉంటుందా. విచిత్రంగా మహేష్ పవన్ లు బయట కలుసుకున్న సందర్భాలు కూడా గత కొన్నేళ్లలో బాగా తగ్గిపోయాయి. అందుకే ఇరు హీరోల అభిమానులు స్క్రీన్ మీద కలిసి చూడాలని కోరుకోవడం తప్పేమి కాదు. అయితే ఇది చేయగలిగిన సత్తా ఇద్దరికే ఉందని చెప్పొచ్చు. ఒకరు రాజమౌళి, మరొకరు త్రివిక్రమ్. మార్కెట్ లెక్కల్లో రాజమౌళి బెస్ట్ ఆప్షన్ అనుకుంటే మహేష్ పవన్ లతో సమానమైన బాండింగ్ ఉన్న త్రివిక్రమ్ సరైన కథ దొరకాలే కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు. ఇదంతా మాటల్లో చెప్పుకునేందుకు బాగానే ఉంది కానీ ఎప్పటికి నెరవేరుతుందో