iDreamPost

షాకింగ్: మొన్న విద్యార్థులు, నేడు హాస్టల్ వార్డెన్!

షాకింగ్: మొన్న విద్యార్థులు, నేడు హాస్టల్ వార్డెన్!

ఈమె పేరు భవాని. హైదరాబాద్ లోని నారాయణ కాలేజీలో హాస్టల్ వార్డెన్ గా ఇటీవలే జాయిన్ అయింది. ఇక రోజూ పిల్లలను చూసుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఉండేది. అయితే కాలేజీలో చేరిన నాటి నుంచి అందరితో కలిసి మాట్లాడుతూ సంతోషంగానే ఉన్నట్టు నటించింది. కానీ, భవాని ఉన్నట్టుండి ఇలా చేసి ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది. ఈ యువతి ఇలా చేస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. మొన్న విద్యార్థులు, నేడు కాలేజీ మహిళా వార్డెన్ ఇలా చేయడంతో అందరూ షాక్ గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన భవాని (21) కొంత వరకు చదువుకుంది. ఇక ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చింది. ఇటీవల మదాపూర్ లోని నారాయణ కాలేజీలో హాస్టల్ వార్డెన్ గా జాయిన్ అయింది. నిన్నటి వరకు ఆ యువతి ఎంతో ఉత్సాహంగా కనిపించినట్లు తెలుస్తుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ.., ఈ యువతి శుక్రవారం హాస్టల్ లోని ఓ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కొందరు విద్యార్థినులు ఆమెను అలా చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు.

అప్రమత్తమై వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు. వాళ్లు అక్కడికి చేరుకుని భవానిని చూసి ఖంగుతిన్నారు. వెంటనే మదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళా వార్డెన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న భవాని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు.

ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. భవాని ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది. అయితే.., మొన్నటికి మొన్న విద్యార్థులు కాలేజీలోని గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా హాస్టల్ వార్డెన్ ఆత్మహత్య చేసుకోవడం అనేది తీవ్ర చర్చకు దారి తీసింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి: అందంగా కనిపిస్తున్న ఈ నర్సు మనిషి కాదు! ఏకంగా 7 మందిని..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి