iDreamPost
android-app
ios-app

జూలై 1 నుంచి మూడు కొత్త చట్టాలు.. కీలక మార్పులు ఇవే!

Three New Criminal Laws: 2023లో ఎన్డీయే ప్రభుత్వం మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో మూడు కీలక చట్టాలపై తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. జూలై 1వ తేదీ నుంచి కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి.

Three New Criminal Laws: 2023లో ఎన్డీయే ప్రభుత్వం మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో మూడు కీలక చట్టాలపై తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. జూలై 1వ తేదీ నుంచి కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి.

జూలై 1 నుంచి మూడు కొత్త చట్టాలు.. కీలక మార్పులు ఇవే!

ఇటీవలే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం ఎన్నికల హడావుడిగా బాగా సాగింది. దాదాపు రెండు నెలల పాటు ఈ ఎన్నికల సంగ్రామం జరిగింది. అంతేకాక ఫలితాలు కూడా వచ్చి.. ఏ పార్టీలు అధికారంలోకి వచ్చాయి అనేది తెలింది. గతం కంటే చాలా తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ముచ్చటగా మూడోసారి ఎన్డీయే కూటమినే అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో గతంలో ఎన్డీయే ప్రభుత్వం చేసి..మూడు కీలక చట్టాలపై తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. జూలై 1వ తేదీ నుంచి కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి. ఇంతకీ ఆ చట్టాలు ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

2023లో ఎన్డీయే ప్రభుత్వం మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసింది.  భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్లేస్  లో భారతీయ సాక్ష్య అధినయమ్ 2023 అనే కొత్త చట్టాలకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. ఈ చట్టాలకు 2023 డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అంతేకాక డిసెంబర్ 25వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో గతంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మూడు చట్టాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసింది.

july

ఇక ఆ నోటిఫికేషన్‌ల ప్రకారం, కొత్త చట్టాల నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. బ్రిటీష్ కాలంలో ఏర్పాటు చేసిన చట్టాల స్థానంలో కొత్తగా ఈ నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)-1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత-2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీపీసీ)-1973 స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత-2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ)-1872 స్థానంలో భారతీయ సాక్ష్య అధినయమ్-2023 అమలులోకి రానున్నాయి. ఇక ఈ కొత్త చట్టాల్లో అనేక మార్పులు చేశారు.

జీరో ఎఫ్ఐఆర్, ఆన్ లైన్ లో పోలీసులకు ఫిర్యాదు, ఎలక్ట్రానిక్ రూపంలోనే సమన్లు, దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయడం వంటి కీలక అంశాలను ఈ కొత్త చట్టాల్లో ఉండనున్నాయి. ఇక ఈ కొత్త చట్టాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ కు వెళ్లనవసరం లేకుండానే ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. దీంతో తేలికగా, వేగంగా ప్రజలు తమ సమస్యను పోలీసులకు తెలియజేయవచ్చు. ఇప్పటికే పోలీసులకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇచ్చారు. మొత్తంగా జులై 1వ తేదీ నుంచి ఈ కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి. మరి.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.