iDreamPost

Rohit Sharma: పోయిన చోటే వెతుక్కోవాలి.. ఇది రోహిత్ నేర్పిన పాఠం!

  • Published Jun 28, 2024 | 4:25 PMUpdated Jun 28, 2024 | 4:25 PM

టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్​కు దూసుకెళ్లింది టీమిండియా. నాకౌట్ ఫైట్​లో ఇంగ్లండ్​ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది. కప్పు కోసం ఆఖరి పోరులో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది రోహిత్ సేన.

టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్​కు దూసుకెళ్లింది టీమిండియా. నాకౌట్ ఫైట్​లో ఇంగ్లండ్​ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది. కప్పు కోసం ఆఖరి పోరులో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది రోహిత్ సేన.

  • Published Jun 28, 2024 | 4:25 PMUpdated Jun 28, 2024 | 4:25 PM
Rohit Sharma: పోయిన చోటే వెతుక్కోవాలి.. ఇది రోహిత్ నేర్పిన పాఠం!

టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్​కు దూసుకెళ్లింది టీమిండియా. ఇంగ్లండ్​ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది. కప్పు కోసం ఆఖరి పోరులో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది రోహిత్ సేన. నిన్న ఇంగ్లండ్​తో జరిగిన నాకౌట్ ఫైట్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన మెన్ ఇన్ బ్లూ.. ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (39 బంతుల్లో 57), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47) ధనాధన్ బ్యాటింగ్​తో మెరిశారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన బట్లర్ సేన 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ (3/19), అక్షర్ పటేల్ (3/23) ప్రత్యర్థి వెన్ను విరిచారు. పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా (2/12) కూడా అద్భుతమైన బౌలింగ్​తో ఆకట్టుకున్నాడు.

సెమీస్​లో ఇంగ్లండ్​పై భారత్ ఘనవిజయం సాధించడంతో అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. టీమిండియా ప్లేయర్లు కూడా ఈ విక్టరీని ఫుల్​గా సెలబ్రేట్ చేసుకున్నారు. అందరూ నవ్వుతూ, కేరింతలు కొడుతూ కనిపించారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. నాకౌట్ ఫైట్​లో గెలుపుతో సంతోషం పట్టలేక అతడు ఏడ్చేశాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్​తో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సముదాయించినా హిట్​మ్యాన్​ వినలేదు. చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉండిపోయాడు. ఆ ఎమోషనల్ మూమెంట్స్​కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్రికెట్ లవర్స్​కు ఇది మరో గెలుపే కావొచ్చు. కానీ రోహిత్​కు అలా కాదు. ఇవి అతడికి భావోద్వేగభరిత క్షణాలు. ఏ సెమీస్​లోనైతే ఇంగ్లండ్ మనల్ని చిత్తుగా ఓడించిందో.. అదే వరల్డ్ కప్ నాకౌట్ ఫైట్​లో ఆ టీమ్​ను అంతకు డబుల్​గా చిత్తు చేసింది టీమిండియా. ఏ దూకుడు మంత్రంతో మన పని పట్టారో దాన్నే పాటించి ఇంగ్లీష్ టీమ్​ను ఇంటికి పంపింది రోహిత్ సేన.

టీ20 ప్రపంచ కప్-2022లో భారత్​ను 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓడించింది. ఆ మ్యాచ్​లో మన టీమ్ సంధించిన 168 పరుగుల టార్గెట్​ను ఒక్క వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఆ ఓటమి కెప్టెన్ రోహిత్​ను ఎంతో బాధించింది. బాగా ఆడినా ఓడటం, ఇంగ్లీష్ టీమ్​ను ఆపలేకపోవడం అతడ్ని హర్ట్ చేసింది. ఓటమి బాధ నుంచి కోలుకునేందుకు కొన్నాళ్లు టైమ్ తీసుకున్నాడు హిట్​మ్యాన్. అక్కడి నుంచి అతడి దృక్పథం మారిపోయింది. రికార్డులు, పర్సనల్ మైల్​స్టోన్స్ కాదు.. టీమ్ గెలుపే ముఖ్యంగా ఆడాలని ఫిక్స్ అయ్యాడు. తనతో పాటు మిగతా ప్లేయర్లు కూడా నిస్వార్థంగా ఆడాలని డిసైడ్ అయ్యాడు. ఫియర్​లెస్ అప్రోచ్​తో ముందుకు వెళ్లాలని తీర్మానించుకున్నాడు.

ఫియర్​లెస్ అప్రోచ్​ను అమల్లో పెట్టి ఇప్పటివరకు సక్సెస్​ఫుల్​గా జట్టును నడిపిస్తూ వస్తున్నాడు రోహిత్. ఈ పొట్టి కప్పులోనూ అదే విధంగా ఆడుతూ, తన తోటి ఆటగాళ్లను అదే మెంటాలిటీతో ఆడిస్తూ జట్టుకు ఎదురులేకుండా చేశాడు. నిన్న ఇంగ్లండ్​ మీద కూడా అటాకింగ్ అప్రోచ్​నే ఆయుధంగా వాడి చిత్తు చేశాడు. టీ20ల్లో 68 పరుగుల తేడాతో గెలుపు అంటే డబులు విక్టరీ అనే చెప్పాలి. ఏ సెమీస్​లోనైతే ఓడాడో అదే సెమీస్​లో ఇంగ్లీష్ టీమ్​ను ఓడించడం ద్వారా పోయిన చోటే వెతుక్కోవాలనే సూత్రాన్ని నేర్పించాడు హిట్​మ్యాన్. ఓటమి నుంచి లేచి నిలబడి గెలుపు కోసం కొత్త మార్గాలను అన్వేషించడం, స్వార్థం పక్కనబెట్టి చేయాల్సిన పనిని సరిగ్గా నిర్వర్తించడం, గెలుపైనా ఓటమైనా ఎంచుకున్న మార్గాన్ని వదలకపోవడం అతడి నుంచి అందరూ తెలుసుకోవాల్సిన లెసన్స్.

ఇదీ చదవండి: మరోసారి ఇండియాపై తన కుళ్లును వెల్లగక్కిన పాక్‌ దిగ్గజ క్రికెటర్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి