iDreamPost

Kalki 2898 AD:కల్కి సినిమా నుంచి మానవాళి నేర్చుకోవాల్సిన 7 విషయాలు! మనిషి మారాలి!

  • Published Jun 28, 2024 | 4:01 PMUpdated Jun 28, 2024 | 4:01 PM

Kalki 2898 AD, Prabhas, Nag Ashwin: కల్కి 2898 ఏడీ సినిమా ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా ఉంది. ఇప్పటికే సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ చూసేందుకు సినీ అభిమానులు ఎగబడుతున్నారు. అయితే.. ఈ సినిమా చూసిన తర్వాత మనం బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం..

Kalki 2898 AD, Prabhas, Nag Ashwin: కల్కి 2898 ఏడీ సినిమా ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా ఉంది. ఇప్పటికే సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ చూసేందుకు సినీ అభిమానులు ఎగబడుతున్నారు. అయితే.. ఈ సినిమా చూసిన తర్వాత మనం బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 28, 2024 | 4:01 PMUpdated Jun 28, 2024 | 4:01 PM
Kalki 2898 AD:కల్కి సినిమా  నుంచి మానవాళి నేర్చుకోవాల్సిన 7 విషయాలు! మనిషి మారాలి!

ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్‌ బేస్‌కు తోడు, కామన్‌ ఆడియన్‌ కూడా సినిమాకు కనెక్ట్‌ కావడంతో సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తొలి రోజే ఏకంగా 180 కోట్ల కలెక్షన్లు సాధించింది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, విజయ్‌ దేవరకొండ, దిషా పటాని లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా అంతే భారీ సక్సెస్‌ దిశగా దూసుకెళ్తోంది. అయితే.. ఈ కల్కి 2898 ఏడీ సినిమా చూసి.. మనం కొన్ని విషయాల్లో కచ్చితంగా బుద్ది తెచ్చుకోవాలి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ సినిమా కథ గురించి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కొన్ని విషయాలు ముందే వెల్లడించాడు. సినిమాలో మూడు ప్రదేశాలు ఉంటాయి.. కాంప్లెక్స్‌, కాశీ, శంబాల. ఈ మూడు ప్రాంతాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఆ మూడు ప్రాంతాలు ఎలా ఉంటాయి? అక్కడి ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తారు అనే సినిమా కథ జోలికి పోకుండా.. కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే.. గంగా నది ఎండిపోయి.. మంచి నీళ్ల కోసం అలమటిస్తూ.. ఆక్సిజన్‌ మాస్కులు పెట్టుకుని.. బతకడం కోసం పోరాటం చేసే పరిస్థితులు ఉంటాయి. భూమి నుంచి నీటిని, ఖనిజాలను, వనరులను అన్ని లాగేస్తూ.. వాటిని కేవలం ధనికుల కోసమే ఉంచుకుంటారు. కొంత మంది భోగభాగ్యాలు అనుభవిస్తుంటే.. మరికొంత మంది కనీసం స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోలేని దారుణమైన పరిస్థితుల్లో బతుకుతుంటారు.

7 things humanity should learn from the movie Kalki

సినిమాలో చూపించినట్లు మనకు ఇప్పటికిప్పుడు అలాంటి పరిస్థితులు రాకపోవచ్చు కానీ.. భవిష్యత్తు మాత్రం కచ్చితంగా అదే. గ్లోబుల్‌ వార్మింగ్‌ పెరిగిపోయి, భూగర్భ జలాలు అడుగంటిపోయి, అడువులు నాశనం అయిపోయి.. కచ్చితంగా అలాంటి రోజులు మాత్రం వస్తాయనే విషయాన్ని గ్రహించాలి. సినిమాలోని ఒక పాత్ర సముద్ర తీరం చూసి మైమర్చిపోతుంది, పచ్చదనం చూసి పర్వశించిపోతుంది, బత్తాయి పండు ఎలా తినాలో కూడా తెలియని జీవితం ఆ పాత్రది. మరికొన్ని పాత్రలు అయితే.. వర్షం వస్తే అదేదో పై నుంచి దేవుడే దిగి వచ్చినట్లు సంతోషపడిపోతాయి. ఇలాంటి పరిస్థితి మనకూ వస్తుంది. ఎందుకంటే.. మనం ఇప్పుడు చేస్తున్న తప్పులే అందుకు కారణం.

అవసరానికి మించి విలాసవంతమైన జీవితం గడిపేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకోసం విచ్చలవిడిగా ప్రకృతిని నాశనం చేస్తున్నాం. భూమిలో ఉండే ఖనిజాలను మన అవసరాల కోసం ఇష్టమొచ్చినట్లు తోడేస్తున్నాం.. గాలి, నీరు లాంటి సహజ వనరులనైతే హద్దులేకుండా కలిషితం చేస్తున్నాం.. ఇలా విచ్చలవిడిగా బతికితే.. కచ్చితంగా కల్కిలో చూపించిన ‘కాశీ బతుకులు’ మన భవిష్యత్తు తరాలు అనుభవించాల్సి వస్తుంది. అవసరానికి మించి కార్లు.. కొంతమంది ఇళ్లలో ఎంత మంది ఉంటే అంత మందికీ కార్లు.. నలుగురు ఉండే ఇంటికి నలభై గదులు.. అవసరమా? డబ్బుంది కొనుకుంటున్నారు అని అనుకోవచ్చు కొంతమంది, కానీ.. ఒక కారు తయారు చేయడానికి ఎంతో ఇనుము, ఎంతో ప్లాస్లిక్‌, ఎంతో రబ్బర్‌ కావాలి.. వాటి కోసం భూమి నుంచి ఖనిజాలు తవ్వేయాలి. పైగా పెట్రోల్‌ డిజీల్‌ లాంటి ఇంధన వినియోగం.. దాని నుంచి వచ్చే పొగతో గాలి కాలుష్యం.. కారులో ఒక్కడే వెళ్తూ ట్రాఫిక్‌లో తన చుట్టూ ఉన్న వాళ్లకు విష వాయువు పంచుతున్నాడు. అలాగే విచ్చలవిడి నిర్మాణాలు.. వాటి కోసం సిమెంట్‌, ఇసుక, ఇటుక, ఇనుము.. మళ్లీ భూమిని ఖనిజాల కోసం తవ్వేయాలి. నదులు, సముద్రాల నుంచి ఇసుకను తోడేయ్యాలి.

విద్యుత్‌ వినియోగం కూడా అంతే.. పట్టపగలు లైట్లు వెలగాలి.. అవరసం ఉన్నా లేకపోయినా ఫ్యాన్లు, ఏసీలు నడవాలి వాటి కోసం ఎంత విద్యుత్‌ ఖర్చు అవుతుంది. విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ఎంత బొగ్గును వాడుతున్నారు.. ఆ బొగ్గు తవ్వితీసేందుకు భూమిని దారుణంగా చీల్చేస్తున్నారు. ఇంట్లో ఏసీ పెట్టుకుని.. బయటికి వేడి గాలి వదిలేస్తున్నారు.. చెట్లు కొట్టేసి పెద్ద పెద్ద భవనాలు, రోడ్లు నిర్మిస్తున్నారు.. ఆ తర్వాత స్వచ్ఛమైనా గాలి అందక.. ఎయిర్‌ ప్యూరిఫైయర్లు కూడా వాడుతున్నారు. ఇలా సహజ వనరుల విషయంలో లెక్కలేనితనం వల్ల మనం ఏం నష్టపోతున్నామో ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు.. కానీ వాటి దుష్ఫలితాలను మన భవిష్యత్తు తరాలు అనుభవించాల్సిందే.

ప్రకృతి విషయంలో మనం చేస్తున్న తప్పుల వల్ల మన జీవితాలు దుర్భరంగా మారితే.. ఆ దేవుడు కాపాడేందుకు వస్తాడో లేదో తెలియదు కానీ.. మన భవిష్యత్తు తరాలు గుక్కెడు నీళ్ల కోసం, స్వచ్ఛమైన గాలి కోసం, పచ్చదనం కోసం పరితపించిపోకుండా ఉండాలంటే మాత్రం.. మనం ఓ ఏడు విషయాలు నేర్చుకోవాలి.. నీటి వృథాను అరికట్టాలి, ఎయిర్ పొల్యూషన్‌ నియంత్రించాలి, నేలను కాపాడుకోవాలి, ప్రకృతిని ప్రేమిస్తూ చెట్లను నాటాలి, విలాసవంతమైన సౌకర్యాల కోసం అవసరానికి మించి సహజ వనరులను వాడుకోవద్దు, దేశాల మధ్య యుద్ధాలు, ఆధిపత్య ధోరణి తగ్గించుకోవాలి, సంపద కొంతమంది దగ్గర కాకుండా.. అందరికి సమానంగా ఉండేలా ప్రభుత్వాలు చూసుకోవాలి.. ఈ ఏడు విషయాలు జరిగితే.. మన భవిష్యత్తు తరాలు కల్కి సినిమాలో చూపించిన ఆధ్వాన పరిస్థితులను అంత త్వరగా చూసే అవకాశం ఉండకపోవచ్చు. చివరిగా ఒక్క మాట.. ‘కల్కి వచ్చి కాపాడే లోపు.. మన పాపాలను మనమే తగ్గించుకోవాలి.’

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి