iDreamPost

క్యాన్సర్‌ బారిన పడ్డ ప్రముఖ నటి.. థర్డ్‌ స్టేజ్‌ అంటూ పోస్ట్‌

  • Published Jun 28, 2024 | 4:15 PMUpdated Jun 28, 2024 | 4:15 PM

Hina Khan, Cancer: ప్రముఖ నటి ఒకరు క్యాన్సర్‌ బారిన పడ్డారు. థర్డ్‌ స్టేజ్‌లో ఉందని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Hina Khan, Cancer: ప్రముఖ నటి ఒకరు క్యాన్సర్‌ బారిన పడ్డారు. థర్డ్‌ స్టేజ్‌లో ఉందని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

  • Published Jun 28, 2024 | 4:15 PMUpdated Jun 28, 2024 | 4:15 PM
క్యాన్సర్‌ బారిన పడ్డ ప్రముఖ నటి.. థర్డ్‌ స్టేజ్‌ అంటూ పోస్ట్‌

నేటి కాలంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న ముఖ్యమైన అనారోగ్యాల్లో క్యాన్సర్‌ ముందు వరుసలో ఉంటుంది. ఎంత అడ్వాన్స్‌ టెక్నాలజీ వచ్చినా సరే.. క్యాన్సర్‌ను పూర్తి స్థాయిలో నివారించే చికిత్స అయితే ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న చికిత్సలు చాలా ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాక.. ఎంతో క‍ష్టమైనవి కూడా. ఈ చికిత్స విధానాల ద్వారా క్యాన్సర్‌ను పూర్తిగా తొలగించినా.. ఆ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా.. ఆహారం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా.. మరిన్ని అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. ఇక ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు క్యాన్సర్‌కు గురైన వార్తలను ఎక్కువగా వింటూ ఉన్నాం. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ నటి చేరింది. తాను క్యాన్సర్‌ బారిన పడ్డట్లు ఆ నటి స్వయంగా వెల్లడించింది. ఆ వివరాలు..

తనకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌.. అది కూడా థర్డ్‌ స్టేజ్‌ అంటూ.. నటి సంచలన విషయాన్ని పోస్ట్‌ చేసింది. ఇంతకు తను ఎవరంటే.. బాలీవుడ్‌ బ్యూటీ హీనా ఖాన్‌. ఈ అమ్ముడు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. హిందీలో సూపర్‌ హిట్టు అయిన ‘హే రిస్తా క్యా ఖేల్తా హై’ తెలుగు డబ్బింగ్‌ వర్షన్‌ పెళ్లంటే నూరేళ్ల పంట పేరుతో వచ్చిన సీరియల్‌ ద్వారా పరిచయం అయ్యింది. ఈ సీరియల్‌ మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి హిందీలో అవకాశాలు పెరిగాయి. నాగిన్‌ సీజన్‌ 5 లో నటించింది. సినిమాలతో పాటు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లో కూడా యాక్ట్‌ చేస్తూ ఉంటుంది. కెరీర్‌లో విజయవంతంగా దూసుకుపోతున్న హీనా ఖాన్‌.. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా.. తనకు క్యాన్సర్‌ అని వెల్లడించింది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌.. థర్డ్‌ స్టేజ్‌ అని ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చింది.

‘‘అందరికి హాయ్‌.. గత కొంత కాలం నుంచి నేను ఒక రూమర్‌ గురించి వింటున్నాను. ఈ క్రమంలో మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి. నాకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌.. మూడో స్టేజ్‌లో ఉంది. ఇప్పటికే ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నాను. నేను బాగానే ఉన్నాను. ఈ వ్యాధి నుంచి కోలుకుంటానని ఎంతో ధైర్యంగా, నమ్మకంగా ఉన్నాను. క్యాన్సర్‌ నుంచి కోలుకోవడానికి ఏం చేయడానికి అయినా నేను సిద్ధమే. ఈ సమయంలో మాకు కాస్త ప్రైవసీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను’’ అని చెప్పుకొచ్చింది.

జమ్ము కశ్మీర్‌లో పుట్టి పెరిగిన హీనా ఖాన్.. 2009 నుంచి నటిగా కొనసాగుతోంది. ‘హే రిస్తా క్యా ఖేల్తా హై’ సీరియల్‌తో కెరీర్ మొదలుపెట్టింది. దీని తర్వాత ఫియర్ ఖత్రోంకి ఖిలాడీ 8, బిగ్ బాస్ 11 రియాలిటీ షోల్లో పాల్గొంది. నాగిన్ 5, షద్యంత్రా తదితర సీరియల్స్‌లోనూ కీలక పాత్రలు చేసి ఆకట్టుకుంది.ఓ అరడజను సినిమాలు, రెండు వెబ్ సిరీసులు కూడా చేసింది. సీరియల్ నటిగా కొనసాగుతున్న టైంలోనే ప్రొడ్యూసర్ రాకీ జైశ్వాల్‌ని ప్రేమించి అతడిని 2014లో పెళ్లి చేసుకుంది. హీనా ఖాన్‌కు క్యాన్సర్‌ అని తెలియడంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి