iDreamPost

Viswak Sen: ఇన్ స్టా అకౌంట్ క్లోజ్ చేసిన విశ్వక్ సేన్.. కారణం అదేనా?

  • Published Jun 28, 2024 | 4:19 PMUpdated Jun 28, 2024 | 4:19 PM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో తన నటనతో విశ్వక్ మంచి మార్కులే వేసుకున్నారు. అయితే తాజాగా విశ్వక్ తన ఇన్ స్టా అకౌంట్ ను క్లోజ్ చేశారు. కాగా, ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో తన నటనతో విశ్వక్ మంచి మార్కులే వేసుకున్నారు. అయితే తాజాగా విశ్వక్ తన ఇన్ స్టా అకౌంట్ ను క్లోజ్ చేశారు. కాగా, ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Jun 28, 2024 | 4:19 PMUpdated Jun 28, 2024 | 4:19 PM
Viswak Sen: ఇన్ స్టా అకౌంట్ క్లోజ్ చేసిన విశ్వక్ సేన్.. కారణం అదేనా?

మాస్ కా దాస్ ‘విశ్వక్ సేన్’ ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాగా,యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు.ఇకఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా,అంజలి కీలక పాత్రలో నటించారు.అయితే ఈ సినిమా గతనెల మే 31వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో అందరి అంచనాలు మేరకు ఆకట్టుకోలేక పోయింది. అయితే యావరేజ్ టాక్ ను మాత్రమే సొంతం చేసుకుంది. కానీ, ఈ సినిమాలో మరోసారి విశ్వక్ తన నటనతో అదరగొట్టేశాడని చెప్పవచ్చు. పైగా ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ యంగ్ హీరో సోషల్ మీడియా అయిన ఇన్ స్టా అకౌంట్ ను క్లోజ్ చేశారు. ప్రస్తతం ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు వివాదాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే సైలెంట్ గా ఊరుకోకుండా.. గట్టి కౌంటర్ ఇవ్వడం ఈ హీరోకు అలవాటు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్స్ చేసే కామెంట్స్ కు కూడా ఈ హీరో తనదైన శైలిలో ఆన్సర్ చేస్తుంటాడనే విషయం తెలిసిందే.  ఇలా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విశ్వక్ సడన్ గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను క్లోజ్ చేశారు. ఈ న్యూస్ తెలుసుకున్న విశ్వక్ సేన అభిమానులు కంగారు పడుతున్నారు. ఇంత సడన్ గా సోషల్ మీడియా నుండి అవుట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు విశ్వక్ సేన్ ఇన్స్టా అకౌంట్ కు ఎం అయ్యింది అంటూ నెట్టింట చర్చలు కొనసాగుతన్నాయి. అయితే ఇటీవలే జరిగిన ఓ వివాదమే విశ్వక్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమనే కామెంట్స్ కూడా నెట్టింట వినిపిస్తున్నాయి.

Viswaksen

ఇంతకి ఏం జరిగిందంటే.. విశ్వక్ సేన్ ఇటీవల సోషల్ మీడియాలో సినిమాలపై రివ్యూలు ఇచ్చే ఓ యూట్యూబ్ బ్యాచ్ గురించి  ఓ పోస్ట్ పెట్టారు. అయితే యూట్యూబ్ లో ఓ వ్యక్తి కల్కి సినిమా గురించి ఓ మీడియో చేశాడు. ఇక ఆ వీడియోను ప్రస్తావించి విశ్వక్ ఇంకా విడుదల కూడా కానీ సినిమా గురించి అప్పుడే రివ్యూలో ఇవ్వడం మొదలుపెట్టేశారు. మీకు దమ్ముంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేసి చూపించు అంటూ కౌంటర్ వేశాడు. ఇక దానికి స్పందించిన ఆ యూట్యూబర్ కూడా అదే రేంజ్ లో గట్టిగానే సమాధానం ఇచ్చాడు. అయితే ఈ వివాదం కారణంగానే విశ్వక్ తన ఇన్ స్టా అకౌంట్ నుంచి లెప్ట్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. కానీ, కొందరేమో.. ప్రస్తుతం విశ్వక్ సేన్ సినిమాలేవి విడుదలకు సిద్ధంగా లెవు కాబట్టి, మళ్ళీ సినిమా రిలీజ్ టైం కి ఇన్స్టాకి వస్తారని కొందరు అభిప్రాయం పడుతున్నారు. అయితే నిజంగా విశ్వక్ సోషల్ మీడియా నుంచి ఎందుకు లెఫ్ట్ అయ్యారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి, విశ్వక్ సేన్ ఇన్ స్టా గ్రామ్ నుంచి లెఫ్ట్ అవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి