iDreamPost

బెట్టింగ్ యాప్స్‌ని మేము ప్రమోట్ చేయకపోతేనే పెద్ద తప్పు: హర్ష సాయి

Harsha Sai On Betting Apps: ఇటీవల హర్ష సాయి మీద యూట్యూబర్ యువసామ్రాట్ రవి పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా వచ్చే డబ్బుల కోసం పేదలను వాడుకుంటున్నాడని ఆరోపణలు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై హర్ష సాయి స్పందించారు.

Harsha Sai On Betting Apps: ఇటీవల హర్ష సాయి మీద యూట్యూబర్ యువసామ్రాట్ రవి పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా వచ్చే డబ్బుల కోసం పేదలను వాడుకుంటున్నాడని ఆరోపణలు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై హర్ష సాయి స్పందించారు.

బెట్టింగ్ యాప్స్‌ని మేము ప్రమోట్ చేయకపోతేనే పెద్ద తప్పు: హర్ష సాయి

బెట్టింగ్ యాప్స్ విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. యూట్యూబ్ వీడియోస్ లో, ఇన్ స్టా వీడియోస్ లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వారి మీద.. నా అన్వేషణ అన్వేష్, యూట్యూబర్ యువసామ్రాట్ రవి వంటి వారు గత కొన్ని రోజుల నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి వంటి వారు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ ఎంతోమంది అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల యూట్యూబర్ యువసామ్రాట్ రవి సంచలన ఆరోపణలు చేశారు. హర్ష సాయి సేవ ముసుగులో పేద వాళ్ళను ముంచుతున్నాడని.. బెట్టింగ్ యాప్ ల ద్వారా డబ్బు సంపాదించడానికే పేదలకు సాయం చేస్తున్నట్టు నటిస్తున్నాడని కామెంట్స్ చేశారు.

వాళ్లకి అలా డబ్బు సాయం చేస్తేనే సమాజంలో తనకు గుర్తింపు వస్తుందని.. క్రేజ్ తో తాను ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ లో ఫాలోవర్స్ డబ్బులు పెడతారని.. ఆ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చుననే హర్ష సాయి ఈ ఫీల్డ్ ని ఎంచుకున్నాడని రవి ఆరోపించారు. హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు 60 లక్షలు తీసుకున్నారని కూడా ఆరోపించారు. కాగా ఈ ఆరోపణలపై హర్ష సాయి స్పందించారు. తామేమీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం లేదని.. నాన్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ నే ప్రమోట్ చేస్తున్నామని హర్ష సాయి తనని తాను సమర్థించుకున్నారు. ఒకవేళ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పైతే.. ఎందుకు బ్యాన్ చేయడం లేదని ప్రశ్నించారు.

టిక్ టాక్ యాప్ ని బ్యాన్ చేశారు కదా. ఎవరైనా వాడగలుగుతున్నారా? అలానే బెట్టింగ్ యాప్స్ ని కూడా బ్యాన్ చేస్తే సమస్య ఉండదు కదా అని అన్నారు. అయినా పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేసే దానితో పోలిస్తే తాను చేసేది చాలా చిన్నదని అన్నారు. ఒకవేళ మేము బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకపోతే మాకు వచ్చే డబ్బులు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కి వెళ్ళిపోతుందని.. వాళ్ళు నాలెడ్జ్ లేకుండా, డిస్క్లైమర్ కూడా వేయకుండా ప్రమోట్ చేస్తారని.. బాధ్యత లేకుండా ఉంటారని అన్నారు. మేము అయితే జాగ్రత్తలు చెప్తామని, హెచ్చరిస్తామని అన్నారు.

కొంతమంది టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఇన్వైట్ చేసి బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టించి నష్టపోయేలా చేస్తున్నారని.. తాము మాత్రం అలా చేయడం లేదని అన్నారు. కాబట్టి బెట్టింగ్ యాప్స్ ని మేము ప్రమోట్ చేయకపోతేనే నష్టమని.. మేము చేయకపోతే చిన్న చిన్న వాళ్ళు ప్రమోట్ చేసి ఎక్కువ నష్టం చేకూరుస్తారని అన్నారు. అందుకే బాధ్యతగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నామని హర్ష సాయి కామెంట్స్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ని మేము ప్రమోట్ చేయకపోతేనే తప్పు అంటూ వెల్లడించారు. మరి హర్ష సాయి చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి