iDreamPost
android-app
ios-app

మరోసారి ఇండియాపై తన కుళ్లును వెల్లగక్కిన పాక్‌ దిగ్గజ క్రికెటర్‌!

  • Published Jun 28, 2024 | 2:50 PM Updated Updated Jun 28, 2024 | 2:50 PM

Inzamam ul Haq, BCCI: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్ ఉల్‌ హక్‌ భారత్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇంతకు ముందు టీమిండియా బాల్‌ టాంపరింగ్‌ చేస్తోందని ఆరోపించిన ఇంజుమామ్‌.. ఇప్పుడు మరో అడుగుముందుకేసి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Inzamam ul Haq, BCCI: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్ ఉల్‌ హక్‌ భారత్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇంతకు ముందు టీమిండియా బాల్‌ టాంపరింగ్‌ చేస్తోందని ఆరోపించిన ఇంజుమామ్‌.. ఇప్పుడు మరో అడుగుముందుకేసి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 28, 2024 | 2:50 PMUpdated Jun 28, 2024 | 2:50 PM
మరోసారి ఇండియాపై తన కుళ్లును వెల్లగక్కిన పాక్‌ దిగ్గజ క్రికెటర్‌!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా జైత్రయాత్ర చూసి పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లు కుళ్లుకుంటున్నారు. టీమిండియా గెలిచిన ప్రతీసారి ఏదో ఒక వివాదాస్పద కామెంట్‌తో తమ కడుపు మంట బయటపెట్టుకుంటున్నారు. తాజాగా పాకిస్థాన్‌ దిగ్గజ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోనే అత్యంత ధనికి క్రికెట్‌ బోర్డు అయిన బీసీసీఐ.. ఐసీసీ శాసిస్తోందని, తమకు నచ్చిన విధంగా వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ను రూపొందించుకుంటూ.. టీమిండియాకు అనుకూలంగా మ్యాచ్‌లు నిర్వహించుకుంటూ వేదికలు ఏర్పాటు చేసుకుంటుందని అన్నాడు.

ఈ వరల్డ్‌ కప్‌లో ఇండియా, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే కేటాయించకపోవడంపై ఇంజమామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వర్షం వల్ల మ్యాచ్‌ రద్దు అయితే.. టీమిండియాను నేరుగా ఫైనల్‌ చేర్చేలా బీసీసీఐ ఇలా చేసిందని.. వర్షం వచ్చే సూచనలు ఉన్న గయానాకు సెమీ ఫైనల్‌ 2ను మార్చిందని అన్నాడు. అంతకుముందు.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిందని, అందుకే అర్షదీప్‌ సింగ్‌కు 15వ ఓవర్‌లో కూడా రివర్స​్‌ స్వింగ్‌ లభిస్తున్నట్లు ఆరోపించాడు.

ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ఏడ్చినట్లు.. టీమిండియా వర్షం కారణంగా కాకుండా తమ సొంత సత్తాతో ఫైనల్‌కు చేరి సరిగ్గా బుద్ధి చెప్పిందని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినా.. మ్యాచ్‌ పూర్తిగా సాగింది. బ్యాటింగ్‌ సమయంలో ఇంగ్లండ్‌ బౌలర్లను పూర్తిగా డామినేట్‌ చేసిన టీమిండియా.. బౌలింగ్‌ సమయంలో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను 103 పరుగులకే కూప్పకూల్చింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఎందులో కూడా ఇంగ్లండ్‌ టీమిండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. మ్యాచ్‌కి ముందు ఇంజమామ్‌ చేసిన వ్యాఖ్యలకు.. మ్యాచ్‌ గెలిచి టీమిండియా గట్టి కౌంటర్‌ ఇచ్చింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.