iDreamPost

కొత్త ఈవీ బ్యాటరీ తయారీ.. 5 నిమిషాల్లో ఛార్జింగ్‌తో 200 కి.మీ ప్రయాణం

  • Published Jun 28, 2024 | 3:39 PMUpdated Jun 28, 2024 | 4:00 PM

ప్రస్తుత కాలంలో ఎలక్ట్రికల్ కార్స్ హావా అనేది ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే 80 శాతం దాకా ఛార్జ్ పూర్తి అయ్యే బ్యాటరీని ఓ ఓ స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.

ప్రస్తుత కాలంలో ఎలక్ట్రికల్ కార్స్ హావా అనేది ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే 80 శాతం దాకా ఛార్జ్ పూర్తి అయ్యే బ్యాటరీని ఓ ఓ స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Jun 28, 2024 | 3:39 PMUpdated Jun 28, 2024 | 4:00 PM
కొత్త ఈవీ బ్యాటరీ తయారీ.. 5 నిమిషాల్లో ఛార్జింగ్‌తో 200 కి.మీ ప్రయాణం

ప్రస్తుత కాలంలో ఎలక్ట్రికల్ కార్స్ హావా అనేది ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఎక్కడ చూసిన రకరకాల మోడల్స్, ఫీచర్స్ కలిగిన కొత్త కొత్త కార్లు అనేవి మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాయి. కాగా, ఇప్పటికే ఎక్కడ చూసిన ఈ ఎలక్ట్రికల్ వాహనాలు మార్కెట్ లో ఏ స్థాయిలో ఆదరణ పొందుతున్నయో, అదే విధంగా సేల్స్ జరుగుతున్నయో అందరికీ తెలిసిందే. కానీ, ఈ ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం అవతుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా గంటల గంటలు ఈ ఛార్జింగ్ తీసుకువాడం వాహనాదారులు ఎక్కడికైనా వెళ్లలడానికి సమయం వృదా అవుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీకి సంబంధించి సమస్యను పరిష్కారించేందుకు ప్రపంచవ్యాప్తంగా భారీ పోటీనే జరుగుతోంది. అయితే తాజాగా నిమిషాల వ్యవధిలోనే వాహనాలకు పూర్తిగా ఛార్జ్ చేసే విధంగా ఓ స్టార్టప్ కంపెనీ బ్యాటరీని తయారు చేసింది. అయితే ఈ బ్యాటరీ కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే 80 శాతం దాకా ఛార్జ్ పూర్తి అయిపోతుంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి బ్యాటరీ చార్జింగ్ విషయంలో చాలా సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఇక దీనిని పరిష్కరించేందుకు ప్రపంచవ్యాప్తంగా భారీ పోటీనే జరుగుతోంది. నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు శరవేగంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని ఓ స్టార్టప్ కంపెనీ తయారు చేసిన బ్యాటరీ కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే 80 శాతం దాకా చార్జ్ అయింది. పైగా దీనిని తాయరుచేసింది బ్రిటన్ లోని తెలుగు వ్యక్తి అయిన డాక్టర్ సాయి శివారెడ్డి కావడం గమన్హారం. అయితే సాయి శివారెడ్డి స్థాపించిన స్టార్టప్ సంస్థ న్యోబోల్ట్ ఈ బ్యాటరీని తయారు చేసింది. అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ తొలి ప్రదర్శనలో నాలుగు నిమిషాల 37 సెకన్లలోనే 10 శాతం నుంచి 80 శాతం విజయవంతంగా చార్జ్ అవుతుందట.

EV vehicle

పైగా ఈ బ్యాటరీని బెడ్ ఫోర్డ్‌లో ప్రత్యేకంగా రూపొందించిన కాన్సెప్ట్ స్పోర్ట్స్ కారుతో పరీక్షించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) త్వరగా ఛార్జ్ అయ్యేలా జరుగుతున్న ప్రయత్నాలలో ఇదొక ముందడుగని ఆ సంస్థ చెబుతుంది. ఇకపోతే ప్రస్తుతం ఉన్న టెస్లా సూపర్‌చార్జర్‌తో కారుకి ఈ బ్యూటరీని 80 శాతం చార్జి చేయాలంటే 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది.ఇదిలా ఉంటే.. మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ఛార్జింగ్ సదుపాయాలను మెరుగుపరచడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.పైగా ఈ విషయంలో రేంజ్ యాంగ్జైట్ కూడా చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఇకపోతే న్యోబోల్ట్ తయారు చేసిన బ్యాటరీని స్పోర్ట్స్ కు ఉపాయోగించి ఆ కారును రెండు రోజులపాటు పరీక్షించారు. ఇక అది ఐదు నిమిషాల బ్యాటరీ చార్జింగ్‌తో 193 కిలోమీటర్లు ప్రయాణించింది.

అలాగే ఇందులో టెస్లా కార్లు అయితే 80 శాతం చార్జ్ చేస్తే దాదాపు 320 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే ఈ బ్యాటరీ పరీక్ష ఫలితాల్లో సంతృప్తిగా ఉన్నామని, కానీ బ్యాటరీ పరీక్ష సమయంలో కాస్త ఆందోళన కలిగించిందని న్యోబోల్ట్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ శివారెడ్డి తాజాగా ఓ మీడియాకు తెలియజేశారు. ఇకపోతే ఈ బ్యాటరీ లాబోరేటరీలో ఫలితాలను మరోసారి చూసుకోవాల్సిన అవసరం లేకుండా తయారు చేశామని, ఇక బ్యాటరీ 6 నిమిషాల్లోనే 0 శాతం నుంచి 100 శాతం చార్జ్ అవుతుందని ఆ సంస్థ పేర్కొంది. అలాగే ఈ ఏడాదిలోగా ఈవీలలోని బ్యాటరీలను చిన్నస్థాయిలో తయారు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు న్యోబోల్ట్ తెలిపింది. మరి, ఐదు నిమిషాల్లో ఎలక్ట్రికల్ వాహనాలకు ఛార్జింగ్ అందించే బ్యాటరీ బ్రిటన్ లోని తెలుగు వ్యక్తి తయారు చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి