iDreamPost

కళ్లు చెదిరే ఫీచర్లతో మార్కెట్ లోకి మరో EV.. సింగిల్ ఛార్జ్ తో 135KM రేంజ్

BGauss RUV350: ఈవీ ప్రియులకు గుడ్ న్యూస్. మార్కెట్ లోకి మరో కొత్త ఈవీ అందుబాటులోకి వచ్చింది. సింగిల్ ఛార్జ్ తో 135 కి.మీలు ప్రయాణించొచ్చు. ధర ఎంతంటే?

BGauss RUV350: ఈవీ ప్రియులకు గుడ్ న్యూస్. మార్కెట్ లోకి మరో కొత్త ఈవీ అందుబాటులోకి వచ్చింది. సింగిల్ ఛార్జ్ తో 135 కి.మీలు ప్రయాణించొచ్చు. ధర ఎంతంటే?

కళ్లు చెదిరే ఫీచర్లతో మార్కెట్ లోకి మరో EV.. సింగిల్ ఛార్జ్ తో 135KM రేంజ్

ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతున్నది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు ఈవీలను రూపొందించే పనిలోపడ్డాయి. ఇప్పటికే ఓలా, ఏథర్, హీరో వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, బైక్ లు రోడ్లపై రయ్ రయ్ మంటూ పరుగులు తీస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న ఈవీల్లో క్రేజీ ఫీచర్లు, మైలేజ్ కూడా అద్భుతంగా ఉండడంతో వాహనదారులు ఈవీలను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మరో కొత్త ఈవీ మార్కెట్ లోకి విడుదలైంది. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ బిగాస్ తాజాగా బిగాస్ ఆర్ యూవీ 350 ఈవీని లాంచ్ చేసింది.

పెరిగిన పెట్రోల్ ధరల కారణంగా ప్రయాణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఈవీలను కొనేందుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. పోను పోను ఈవీలే రాజ్యమేలుతాయనడంలో సందేహం లేదు. ఈవీలు బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో ఆదరణ పెరిగింది. అయితే తాజాగా విడుదలైన బిగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టన్నింగ్ డిజైన్, క్రేజీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 135 కి.మీల వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ వాహనదారులను ఆకట్టుకుంటోంది. ఈ బిగాస్ ఆర్ యూవీ 350 ధర రూ. 1,34,999 గా కంపెనీ నిర్ణయించింది.

ఈ స్కూటర్‌లో స్క్వేర్ హెడ్‌లైట్‌ని అందించారు. ఇందులో 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను గ్రే, ఆరెంజ్, ఎల్లో వంటి మూడు కలర్‌ ఆప్షన్లలో చాలా అందంగా, ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. టర్న్ సిగ్నల్, టెయిల్‌లైట్‌తో అద్బుతమైన లుక్ ను ఇస్తుంది. 5 అంగుళాల టిఎఫ్‌టి డిస్‌ప్లే ఐపీ67 రేటింగ్‌తో ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్కూటర్‌లో కాల్ నోటిఫికేషన్స్, రైడింగ్, ఛార్జింగ్ పర్సంటేజ్, టర్న్ బై టర్న్ వంటి ఫీచర్లు అందించారు. ఇది 4.69 బిహెచ్‌పి, 165ఎన్ ఎం గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 3కెడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ అందించారు. మరి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి