iDreamPost

Hyderabad లోని లులూ మాల్‌కు నోటీసులు జారీ! ఎందుకంటే?

  • Published Jun 28, 2024 | 12:17 PMUpdated Jun 28, 2024 | 12:17 PM

Lulu Hypermarket: తెలంగాణ ఫుడ్‌ సెఫ్టీ అధికారులు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లులు మార్కెట్‌లో సోదాలు నిర్వహించారు. ఆ వివరాలు..

Lulu Hypermarket: తెలంగాణ ఫుడ్‌ సెఫ్టీ అధికారులు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లులు మార్కెట్‌లో సోదాలు నిర్వహించారు. ఆ వివరాలు..

  • Published Jun 28, 2024 | 12:17 PMUpdated Jun 28, 2024 | 12:17 PM
Hyderabad లోని లులూ మాల్‌కు నోటీసులు జారీ! ఎందుకంటే?

గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఫుడ్‌ సెఫ్టీ అధికారులు నగరంలోని రెస్టారెంట్లు, హోటల్స్‌ మీద వరుస సోదాలు నిర్వహిస్తూ.. చుక్కలు చూపిస్తున్నారు. రోడ్డు పక్కన చిన్నా చితక హోటల్స్‌లో నాణ్యత సరిగా లేదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎంతో పేరు మోసిన హోటల్స్‌, రెస్టారెంట్లలో సైతం ఇవే పరిస్థితులు కనిపించాయి. కుళ్లిపోయిన మాంసం, ఎక్స్‌పైర్‌ తేదీ అయిపోయిన మసాలాలు.. ఏమాత్రం నీట్‌గా లేని కిచెన్‌ పరిసరాలు దర్శనం ఇచ్చాయి. ఇక సోదాలు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. వామ్మో మనం తినే తిండి ఇంత దారుణంగా ఉందా అని జనాలు భయపడుతున్నారు. బయట ఫుడ్డు అంటేనే ఒణి​కిపోతున్నారు. ఫుడ్‌ సెఫ్టీ అధికారులు వరుస తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని లులూ మాల్‌లో సోదాలు నిర్వహించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ ఫుడ్‌ సెఫ్టీ అధికారులు.. హైదరాబాద్‌, కూకట్‌పల్లిలో ఉన్న లులూ మాల్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాల్‌ నిర్వాహకులు కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయించడమే కాక.. ఎలాంటి ఆహార భద్రతా ప్రమాణాలు, నిబంధనలు పాటించలేదని తెలిపిన అధికారులు ఈ మేరకు మాల్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఇక సోదాల్లో బేకరీ యూనిట్‌లో బ్రెడ్‌ మిక్స్‌, లూజ్‌ బ్రెడ్‌ మిక్స్‌ వంటి పదార్థాలకు పురుగులు సోకినట్లు గుర్తించి.. వాటిని పారవేసినట్లు చెప్పుకొచ్చారు. నువ్వులు, టోన్డ్‌ మిల్క్‌, బిస్కెట్‌ ప్యాకెట్స్‌, గ్లేజ్‌, జెమ్స్‌, ఫ్రూట్‌ జ్యూస్‌ వంటి కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించామని అధికారులు తెలిపారు.

అలానే ఈ సంస్థలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ సరిగా లేదని.. ఫుడ్‌ సెక్షన్‌లో పని చేసే సిబ్బంది కొందరు సరైన దుస్తులు, గ్లౌజులు, ఆప్రాన్లు లేకుండా కనిపించారని గుర్తించారు. అలానే మాంసం నిల్వ ఉంచిన ప్రదేశంలో ఈగలు సంచరిస్తున్నాయని, ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అంతేకాక ఆహార వ్యర్థాలను అలానే నేలపై పడేశారని, కిచెన్ ఆవరణలో పురుగులు రాకుండా ప్రూఫ్ స్క్రీన్ ను అమర్చలేదని, వంట గదిలో పురుగులు రాకుండా తలుపులు మూసి వేయలేదని తెలిపారు.

మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు అందుబాటులో లేవని, బియ్యం పిండి గడువు ముగిసిందని గుర్తించడంతో వాటిని అక్కడికక్కడే పారేశారని చెప్పుకొచ్చారు. నిబంధనల ఉల్లంఘనపై లులూ హైపర్ మార్కెట్‌కు నోటీసులు జారీ చేస్తామని, తనిఖీ ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి