iDreamPost

మాంసం ప్రియులు శుభవార్త..తగ్గిన చికెన్ ధరలు! ఎంతంటే..!

Chicken Price: ప్రస్తుతం మాసం తినే వారి సంఖ్య బాగా పెరిగింది. మారుతున్న కాలంతో పాటు నాన్ వేజ్  పై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరిగింది. కొన్ని రోజులుగా వీటి ధరలు భారీగా ఉన్నాయి. అయితే తాజాగా మాంసం ప్రియులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

Chicken Price: ప్రస్తుతం మాసం తినే వారి సంఖ్య బాగా పెరిగింది. మారుతున్న కాలంతో పాటు నాన్ వేజ్  పై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరిగింది. కొన్ని రోజులుగా వీటి ధరలు భారీగా ఉన్నాయి. అయితే తాజాగా మాంసం ప్రియులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

మాంసం ప్రియులు శుభవార్త..తగ్గిన చికెన్ ధరలు! ఎంతంటే..!

చాలా మందికి నాన్ వెజ్ అంటే ఎంతో ఇష్టం. ఎక్కువ మందికి ముక్కలేనిది ముద్ద దిగదు. ఈ క్రమంలోనే కొందరు రోజులో ఒక్క పూట అయినా నాన్ వెజ్ లేని రోజును ముగించలేరు. మరికొందరు ఆదివారం వచ్చింది అంటే..నాన్ వేజ్ డేగా సెలబ్రేట్ చేస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. మటన్ ధర ఎక్కువ ఉంటుందని చాలా మంది చికెన్ తింటుంటారు. అంతేకాక కొంతమంది మటన్ తినడం కంటే.. చికెన్ తినేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల చికెన్ ధరలు బాగా పెరిగాయి. దీంతో నాన్ ప్రియులు కాస్తా డల్ అయ్యారు. ఈక్రమంలోనే వారికి ఓ శుభవార్త వచ్చింది. చికెన్ ధరలు తగ్గాయి. మరి.. ఎంత తగ్గాయి, ఎక్కడ, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం మాసం తినే వారి సంఖ్య బాగా పెరిగింది. మారుతున్న కాలంతో పాటు నాన్ వేజ్  పై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరిగింది. అందుకే మాంసాలకు బాగా గిరాకీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే..చాలా మందికి వారంలో ఎక్కువ రోజులు మాంసం ఉండేలా చూసుకుంటారు. ఇక ఏదైనా ఫంక్షన్ అయితే చాలు ముక్కలేనిది..పరిపూర్ణం కాదు. కొందరు ఆదివారం వచ్చింది అంటే.. చాలు నాన్ వెజ్ వంటలతో ఇంటిని గుమగుమలాడిస్తుంటారు. ఇదే సమయంలో చాలా మంది మటన్ ధరక ఎక్కువగా ఉంటుంది.. చికెన్ వైపే ఆసక్తి చూపిస్తుంటారు.

Chicken prices are reduced

ప్రతి ఆదివారం చికెన్  భోజనాన్ని పూర్తి చేస్తుంటారు. అయితే ఇటీవల చికెన్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసింది. రూ.300కి పైగానే దాటింది. ఇలాంటి సమయంలో చాలా మంది..నాన్ వెజ్ ఐటమ్ తినడం కాస్తా తగ్గించుకున్నారు. ఇలాంటి సమయంలోనే మాంసం  ప్రియులకు ఓ శుభవార్త వచ్చింది. హైదరాబాద్ లో చికెన్ ధరలు తగ్గాయి. 20 రోజుల క్రితం చికెన్ ధర భారీగా పెరిగింది. అయితే భారీగా పెరిగిన ధరలు గతవారం నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో చికెన్ ప్రియులు హ్యాపీగా ఉన్నారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో చికెన్ స్కిన్ లెస్ కిలో రూ.220 నుంచి రూ.250 మధ్య పలుకుతుంది.

ఇక హైదరాబాద్ లో కూడ చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారంలో కిలో రూ.250కి పైగా విక్రయించారు. శుక్రవారం చికెన్ ధరలు కాస్తా తగ్గుముఖం పట్టాయి. నేటి  ధరలు చూసినట్లు అయితే. ..ఫాంరేటు రూ.110, రిటైల్  రూ.132 విత్ స్కిన్ కేజీ రూ.191, స్కిన్ లెస్ రూ.218 నుంచి రూ.230 మధ్య అమ్ముతున్నారు. ఇక  ధరలు తగ్గడంతో చికెన్ విక్రయాలు పెరిగే అవకాశం ఉందని కొందరు వ్యాపారస్తులు చెబుతున్నారు. బోనాల సీజన్ కావడంతో ఈ ఆదివారం నుంచి గిరాకీ బాగా ఉంటుందంటున్నారు. మొత్తంగా ఇలా చికెన్ రేట్లు తగ్గడంతో మాంస  ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి