iDreamPost

IND vs ENG: టీమిండియాపై ఘోర ఓటమి.. బట్లర్ సంచలన నిర్ణయం?

టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియాపై ఓటమితో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కుంగిపోయాడు. ఓటమి అనంతరం ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ సంచలన నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లు పేర్కొన్నాడు.

టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియాపై ఓటమితో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కుంగిపోయాడు. ఓటమి అనంతరం ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ సంచలన నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లు పేర్కొన్నాడు.

IND vs ENG: టీమిండియాపై ఘోర ఓటమి.. బట్లర్ సంచలన నిర్ణయం?

టీ20 వరల్డ్ కప్ 2024 గ్రూప్ దశలో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సెమీస్ కు చేరుకుంది ఇంగ్లండ్. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ గా టైటిల్ నిలబెట్టుకోవాలనుకున్న ఆ టీమ్ ఆశలపై టీమిండియా నీళ్లు చల్లింది. దాంతో సెమీస్ లోనే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది బ్రిటీష్ టీమ్. సూపర్ 8 మ్యాచ్ ల్లో అద్భుతంగా ఆడిన ఆ జట్టు.. సెమీ ఫైనల్లో టీమిండియా ముందు తోకముడవక తప్పలేదు. ఇక ఈ ఓటమి తర్వాత ఎమోషనల్ కామెంట్స్ చేశాడు ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్. ఈ క్రమంలోనే ఓ సంచలన నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక.. 103 పరుగులకే కుప్పకూలింది ఇంగ్లండ్. దాంతో 68 పరుగుల తేడాతో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ ఓటమి అనంతరం ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ కుంగిపోయాడు. మ్యాచ్ తర్వాత బట్లర్ మాట్లాడుతూ..”టీమిండియా చేతిలో దారుణంగా ఓడిపోయాం. ఈ ఓటమి ఎంతో బాధించింది. అయితే ఈ విజయానికి భారత్ పూర్తిగా అర్హులు. ప్రత్యర్థిని 140-150 పరుగులకే కట్టడి చేయాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. ఈ పిచ్ పై ఛేదన అంత సులువు కాదు. ఓటమి తర్వాత ఎంతో ఎమోషనల్ అవుతున్నాను. కొన్ని రోజులు ఆటకు దూరం అవ్వాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం దాని గురించి లోతుగా ఆలోచించడం లేదు. కానీ కొన్ని రోజులు ఆటకు విరామం ఇవ్వాలనుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు.

కాగా.. ఈ ఓటమితో టీమ్ లో ఎలాంటి మార్పులు చేయట్లేదని చెప్పుకొచ్చాడు బట్లర్. తమ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, కానీ ఈరోజు వారు రాణించకపోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. భారత్ లాంటి పటిష్టమైన జట్టు ముందు తలొంచాల్సి వచ్చిందని, టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకోవడం మా ఓటమికి కారణం కాదని ఈ సందర్భంగా బట్లర్ చెప్పుకొచ్చాడు. మరి బట్లర్ ఈ ఓటమితో కెప్టెన్సీకి గుడ్ బై చెబుతాడా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి