iDreamPost

ఆ పని చేయోద్దని భార్య హితవు.. భర్త పెడచెవిన పెట్టడంతో ..

Jagityala Crime News.. పెళ్లైన నాటి నుండి భర్త అదే పని చేసేవాడు. భార్య పలుమార్లు వద్దని వారించింది. అయినప్పటికీ వినలేదు. తన మాట పెడచెవిన పెట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది భార్య. చివరకు

Jagityala Crime News.. పెళ్లైన నాటి నుండి భర్త అదే పని చేసేవాడు. భార్య పలుమార్లు వద్దని వారించింది. అయినప్పటికీ వినలేదు. తన మాట పెడచెవిన పెట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది భార్య. చివరకు

ఆ పని చేయోద్దని భార్య హితవు.. భర్త పెడచెవిన పెట్టడంతో ..

పెళ్లైన ప్రతి స్త్రీ బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంటుంది. పురుడు తనకు మరో జన్మ అని తెలిసినా కూడా అమ్మ అనే పిలుపు కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతుంది. కడుపులో పెరుగుతున్న నలుసు కోసం జాగ్రత్తలు తీసుకుంటూ..నచ్చని ఆహార పదార్థాలు కూడా ఇష్టంగా తీసుకుంటుంది. బిడ్డను చేతిలోకి తీసుకుని పొంగిపోతుంది. తల్లి అయ్యానన్న సంతోషం ముందు ఇంకేమీ కానరావు ఆమెకు. బిడ్డ బోర్లా పడినా, పాకుతున్నా, బుడిబుడి అడుగులు వేస్తూ, పడుతూ లేస్తూ ఉంటే మురిసిపోతుంది తల్లి మనస్సు. ఇక మాటలు వచ్చాక.. అమ్మా అని పిలుపు విని ఉబ్బితబ్బిబ్బయిపోతుంది.  తన అంత అదృష్టవంతురాలు లేదని సంబరపడిపోతుంది. కానీ కాపురంలో కలహాల వచ్చినప్పుడు మనస్థాపంతో తనతో పాటు బిడ్డను కూడా వెంట తీసుకెళ్లిపోతుంది మాతృమూర్తి.

తాజాగా ఓ మహిళ నాలుగు సంవత్సరాల బిడ్డతో వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలుస్తుంది. తనతో పాటు తన బిడ్డను కూడా వెంట తీసుకెళ్లిపోయింది తల్లి. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్పల్లి గ్రామానికి చెందిన బొండ్ల మౌనిక, సురేష్ దంపతులు. వీరికి నాలుగేళ్ల కూతురు సాహితీ ఉంది. పెళ్లైన నాటి నుండి భర్త వన్య ప్రాణులను వేటాడుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆమె ఈ విషయంపై తరచూ గొడవపడుతూ ఉండేది. ఏదైనా పని చేసుకుని బతకమని, మూగ జీవాలను వేటాడం సరైన పని కాదని,  చట్ట రీత్యా నేరం అని హెచ్చరించింది. అయిప్పటికీ వినిపించుకోని భర్త తన పంథా మార్చుకోలేదు.

ఈ విషయంపై తరచుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి తగాదా జరగడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మౌనిక.. కూతురు సాహితీని తీసుకుని సమీపంలో ఉన్న వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం గ్రామ శివారులోని బావిలో మృతదేహాలు తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వాటిని బయటకు తీశారు. మౌనిక సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితురాలి భర్త సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. కూతురు చావుకు కారణమైన సురేష్ ఇంటిని ధ్వంసం చేసేందుకు మౌనిక బంధువులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అలాగే నిందితుడిపై వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అతడ్ని విచారిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి