iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

Today Gold and Silver prices: మీరు బంగారం కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?

Today Gold and Silver prices: మీరు బంగారం కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

భారతీయులు బంగారాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు. పెళ్లిల్లు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో గోల్డ్ కొనేందుకు ఇంట్రస్టు చూపిస్తుంటారు. బంగారంపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. భవిష్యత్తులో పసిడి ధరలు పెరుగుతాయనే ఊహాగానాల నేపథ్యంలో పుత్తడిపై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే గత కొన్ని రోజుల క్రింతం వరకు ఆకాశాన్నింటిన బంగారం ధరలు వరుసగా దిగి వస్తున్నాయి. పెరిగిన బంగారం ధరలతో కొనడానికి వెనకడుగు వేసిన వారికి ఇదే మంచి ఛాన్స్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం బంగారం ధర ఎంత ఉందంటే?

ఒక రోజు పెరుగుతూ మరో రోజు తగ్గుతూ షాకిచ్చిన బంగారం ధరలు ఆరు రోజుల నుంచి వరసుగా దిగివస్తున్నాయి. పసిడి ప్రియులకు కొనేందుకు ఇదే మంచి ఛాన్స్. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.250 మేర పడిపోయింది. దీంతో రూ. 65,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.270 మేర దిగివచ్చింది. దీంతో తులం బంగారం ధర రూ. 71,730 వద్ద అమ్ముడవుతోంది. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు తులానికి రూ. 250 మేర తగ్గి రూ. 65,900వద్దకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ. 270 మేర తగ్గి రూ. 71,880 వద్దకు దిగివచ్చింది.

Gold prices fell

గత కొద్ది రోజులుగా బంగారంతో పాటు నేల చూపులు చూసిన వెండి ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి రేటు రూ. 94,400గా ఉంది. విజయవాడలో ఇదే ధర పలుకుతోంది. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 89,900 వద్దకు చేరుకుంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 89,900, చైన్నైలో కిలో వెండి ధర రూ. 94,400, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 89,900, కేరళలో కిలో వెండి ధర రూ. 94,400, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 89,400 పలుకుతోంది.