iDreamPost

ఆ OTTలోకి చిరుత హీరోయిన్ బో*ల్డ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్!

చిరుత మూవీతో కుర్రాళ్ల మదిని దోచేసిన బ్యూటీ నేహా శర్మ. కుర్రాడు మూవీతో తెలుగు ప్రేక్షకులకు దూరం అయ్యింది. హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న అమ్మడు.. ఇప్పుడు ఓ బోల్డ్ వెబ్ సిరీస్ చేసింది. త్వరలో ఓటీటీలోకి రానుంది. తెలుగులో కూడా వీక్షించొచ్చు.

చిరుత మూవీతో కుర్రాళ్ల మదిని దోచేసిన బ్యూటీ నేహా శర్మ. కుర్రాడు మూవీతో తెలుగు ప్రేక్షకులకు దూరం అయ్యింది. హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న అమ్మడు.. ఇప్పుడు ఓ బోల్డ్ వెబ్ సిరీస్ చేసింది. త్వరలో ఓటీటీలోకి రానుంది. తెలుగులో కూడా వీక్షించొచ్చు.

ఆ OTTలోకి చిరుత హీరోయిన్ బో*ల్డ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్!

‘యు నో నేను పులిని, ఆడ పులిని, మా డాడ్ అలా పెంచారు. పులి చాపలు తినదు’ అంటూ ముద్దుముద్దు మాటలతో కట్టిపడేసిన బ్యూటీ నేహా శర్మ. రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ రూపొందించిన మూవీ చిరుత. ఇందులో హీరోయిన్‌గా నటించింది నేహా శర్మ. గొప్పింటి బిడ్డగా, పొగరు బోతుగా నటించి మెప్పించింది. ఆమె నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఈ అమ్మాయికి తెలుగులో వరుస ఆఫర్లు వస్తాయని అనుకున్నారంతా.. కానీ కేవలం రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంది. చిరుత తర్వాత వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు చిత్రంలో నటించి.. హిందీ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ నేమ్, ఫేమ్ రావడంతో.. తెలుగు ఇండస్ట్రీ వైపు తొంగి చూడలేదు అమ్మడు.

త్వరలో ఓ వెబ్ సిరీస్‌తో పలకరించబోతుంది ఈ బ్యూటీ.  36 డేస్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇదొక బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌గా తెరకెక్కుతోంది. త్వరలో ప్రముఖ ఓటీటీలోకి విడుదల కానుంది. సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జూన్ 12న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. తర్వలో అన్ని సీక్రెట్స్ ఆ రోజు రివీల్ అవుతాయని వెల్లడించింది. ఇందులో నేహా శర్మతో పాటు పూరబ్ కోహ్లీ, అమృతా ఖాన్విల్కర్, సుశాంత్ దివికర్, శృతి సేథ్, షరీబ్ హష్మీ, చందన్ రాయ్ సన్యాల్ తదితరులు యాక్ట్ చేయగా.. విశాల్ ఫ్యూరియా దర్శకుడు. గతంలో ఫోరెన్సిక్, ఛోరీతో పాటు పలు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించాడు. హాలీవుడ్‌లో తెరకెక్కిన బోల్డ్ వెబ్ సిరీస్ 35 డేస్ ఆధారంగా ఈ థ్రిలర్ల్ తెరకెక్కింది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో ఈ సిరిస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.

36 Days

ఒక్కో ఎపిసోడ్ సుమారు 50 నిమిషాల పాటు ఉండనున్నట్లు తెలుస్తోంది. అప్లౌజ్ ఎంటర్‌టైన్మెంట్, బీబీసీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే..ట్రైలర్ ఈ సిరీస్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. ఇందులో నేహా శర్మ.. స్విమ్ సూట్‌లో కనిపించి కనువిందు చేసింది. బోల్డ్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఓ యువకుడితో రొమాన్స్, తర్వాత ట్విస్ట్, టర్నింగ్‌లతో ఇంట్రస్టింగ్ క్రియేట్ చేస్తుంది. ఓ వృద్దురాలు కనిపించకుండా పోవడం, ఆ తర్వాత జరిగిన హత్యతో ఎంగేజింగ్ అండ్ క్యూరియాసిటీని కలిగిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. చాలా రోజుల తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకునేందుకు సిద్ధమైంది చిరుత బ్యూటీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి