iDreamPost

Actress Hema: తిరుమలలో హేమ.. రేవ్ పార్టీ కేసుపై మీడియాపై సెటైర్లు

Actress Hema Visit Tirumala.. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్టై.. షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యింది. తాజాగా ఆమె తిరుమల శ్రీవారిని సందర్శించుకుని బయటకు రాగా, మీడియా ఆమెను ఈ కేసు విషయమై ప్రశ్నించగా.. సెటైర్స్ వేసింది.

Actress Hema Visit Tirumala.. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్టై.. షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యింది. తాజాగా ఆమె తిరుమల శ్రీవారిని సందర్శించుకుని బయటకు రాగా, మీడియా ఆమెను ఈ కేసు విషయమై ప్రశ్నించగా.. సెటైర్స్ వేసింది.

Actress Hema: తిరుమలలో హేమ.. రేవ్ పార్టీ కేసుపై మీడియాపై సెటైర్లు

బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఓ ఫాం హౌస్ లో బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించగా స్థానిక పోలీసులు దాడి చేసి 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. అందులో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటీలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారిలో ఒకరు నటి హేమ కూడా. తొలుత తాను ఈ పార్టీలో లేనని బుకాయించేందుకు ఓ వీడియో రిలీజ్ చేయగా.. వెంటనే బెంగళూరు పోలీసులు హేమ ఫోటో రిలీజ్ చేసి ఆమెకే షాకిచ్చారు. కవర్ చేసుకునేందుకు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. కాగా, పట్టుబడిన వారి నుండి శాంపిల్స్ కలెక్ట్ చేయగా.. 86 మందికి పాజిటివ్ అని వచ్చింది. ఈ క్రమంలో నటి హేమతో పాటు వారందరికీ నోటీసులు ఇచ్చింది.

తొలుత జ్వరమని, విచారణకు హాజరు కాలేనంటూ హేమ చెప్పడంతో బెంగళూరు పోలీసులే రంగంలోకి దిగి.. ఆమెను అరెస్టు చేసిన సంగతి విదితమే. ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమెను బెంగళూరు జైలుకు తరలించారు. ఈ నెల 14న ఆమె షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యింది. ఇదిలా ఉంటే.. తాజాగా హేమ ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించింది. శ్రీవారి దర్శనం అనంతరం ఆమె బయటకు రాగా, మీడియా పలు ప్రశ్నలు సంధించింది. రేవ్ పార్టీపై ప్రశ్నించగా.. రేవ్ పార్టీపై అనేక కథనాలు మీరే రాశారు కదా.. అసలేం జరిగిందనేది మీకే తెలియాలి అంటూ సెటైర్స్ వేసింది. ఆమెతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు.

ఇదిలా ఉంటే రేవ్ పార్టీ కేసులో అరెస్టైన హేమను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. గత నెలలో బెంగళూరులో లంకపల్లి వాసు అనే బిజినెస్ మ్యాన్.. బర్త్ డే పార్టీ పేరుతో బెంగళూరులోని ఓ ఫాం హౌస్‌లో రేవ్ పార్టీని నిర్వహించాడు. అక్కడ నానా యాగీ చేయడంతో పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుండి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని వదిలేశారు. ఆ క్రమంలో నటి హేమ పేరు బయటకు వచ్చింది. అబ్బే ఆ ఫాం హౌస్‌లో తాను లేనూ.. హైదరాబాద్‌లో ఉన్నాను అని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించగా..పోలీసులు ఆమె ఫోటో రిలీజ్ చేసి.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. తర్వాత ఫలితాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ కావడంతో అరెస్టు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి